Home / TELANGANA / కరోనా వైరస్.. గిరిజన ప్రాంతాల్లో పటిష్టమైన నివారణ చర్యలు చేపట్టాలి

కరోనా వైరస్.. గిరిజన ప్రాంతాల్లో పటిష్టమైన నివారణ చర్యలు చేపట్టాలి

గిరిజన ప్రాంతాల్లో నివసించే వారికి కరోనా వైరస్ రాకుండా పటిష్టమైన నివారణ చర్యలు చేపట్టాలని, కోవిడ్- 19 వైరస్ పట్ల, ఈ వ్యాధి లక్షణాల పట్ల అవగాహన కల్పించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా – శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, గురుకుల విద్యాలయాల అధికారులు, ఐటీడీఏల ప్రాజెక్టు అధికారులకు ఆదేశాలిచ్చారు.
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల భద్రత, పరీక్షల పట్ల శ్రద్ధ, విద్యాలయాల్లో కరోనా వైరస్ పట్ల అప్రమత్తతపై నేడు దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ సమీక్ష చేశారు.ఆశ్రమ పాఠశాలలు, గిరిజన గురుకుల విద్యాలయాల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు తప్ప మిగిలిన విద్యార్థులందరికీ కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా సెలవులు ప్రకటించిన సందర్భంగా బోర్డు పరీక్షలకు హాజరయ్య విద్యార్థుల ఉత్తీర్ణత, స్కోర్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయాలని సూచించారు.
గత సంవత్సరం డిసెంబర్ నుంచే పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రత్యక తరగతులు పెట్టి ట్యూషన్లు, కోచింగ్ ఇస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మంచి మార్కులు సాధించేలా విద్యార్థులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు.
పదో తరగతి, ఇంటర్ పరీక్షల కోసం డ్యూటీలో ఉన్న ఉపాధ్యాయులు, అధికారులు కచ్చితంగా విద్యా సంస్థల్లో పరీక్షలు పూర్తయ్యే వరకు అందుబాటులోనే ఉండాలన్నారు. అదేవిధంగా ఈ నెల 19వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలున్నందున పరీక్షలకు వెళ్లే విద్యార్థుల వెంట పరీక్షల కేంద్రాలకు ఉపాధ్యాయులు తోడుగా వెళ్లాలని, పరీక్ష పూర్తికాగానే విద్యార్థులు గుమి కూడకుండా వెంటనే మళ్లీ పాఠశాలలకు తీసుకురావాలన్నారు.
గురుకుల పాఠశాలల్లో, ఆశ్రమ పాఠశాలల్లో పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు తప్ప మిగిలిన వారికి సెలవులిచ్చినందున, ఎక్కువ మంది విద్యార్థులు ఒకే గదిలో ఉంచకుండా, ఎక్కువ గదుల్లో తక్కువ మంది ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
గిరిజన విద్యా సంస్థల్లో విద్యార్థులకు కరోనా వైరస్ పట్ల పూర్తి అవగాహన కల్పించాలని, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పటిష్ట నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని, వ్యక్తిగత పరిశుభ్రత పై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని, విద్యార్థులకు మధ్య, విద్యార్థులు – ఉపాధ్యాయులకు మధ్య 1.5 మీటర్ల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తల్లిదండ్రులను వీలైనంత వరకు రాకుండా ఉండేందుకు ముందే వారికి సమాచారం ఇవ్వాలని చెప్పారు.
ముఖ్యమంత్రి కేసిఆర్ గారి సూచనల మేరకు వైద్య, ఆరోగ్య శాఖ నుంచి వచ్చే సూచనలు, జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలన్నారు.
ఐటీడీఏలలోకి కొత్తగా వచ్చే వ్యక్తుల ద్వారాగానీ, ఇతర మార్గాల ద్వారాగాని కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పటిష్ట నివారణ చర్యలు చేపట్టాలన్నారు. అదేసమయంలో కరోనా వైరస్ రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాధి లక్షణాలు, లక్షణాలున్నట్లు కనిపిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా అవగాహన కల్పించే చర్యలు తీసుకోవాలన్నారు.
ఐటీడీఏలంటే గిరిజన సమగ్ర వికాస కేంద్రాలుగా బాసిల్లే విధంగా కొత్తగా వచ్చిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు అంకిత భావంతో, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా పనిచేయాలన్నారు. అట్టడుగున ఉండి, అడవుల్లో ఉన్నగిరిజనులకు సేవ చేసే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గిరిజనుల మన్ననలు పొందేలా పనిచేయాలని సూచించారు. ఐటీడీఏలలో గిరిజనులకు ఉపయోగపడే కుటీర పరిశ్రమలు స్థాపనకు కృషి చేయాలన్నారు. గుడుంబా బాధిత కుటుంబాలకు, వితంతువులకు ఆసరా కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు.
బడ్జెట్ ఆమోదం పొందిన నేపథ్యంలో బడ్జెట్ పట్ల సమగ్ర అవగాహనతో ఉన్న నిధుల ద్వారా ఎక్కువ మందికి లబ్ది చేకూరేలా, ప్రభుత్వ పథకాలు పటిష్టంగా, సత్వరంగా లబ్దిదారులకు చేరేలా తమ మార్కు పాలన చేయాలన్నారు.
ముఖ్యమంత్రి కేసిఆర్ గారు గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక పథకాలు రూపొందించి, అమలు చేస్తున్న సమయంలో వాటన్నింటిని లబ్దిదారులకు చేర్చి ప్రభుత్వం వారికోసం చేస్తున్న కృషి అర్ధమయ్యేలా ప్రాజెక్టు అధికారుల పనితీరు ఉండాలని ఆకాంక్షించారు.
గిరిజనుల కోసం ఇంకా ఎలాంటి పథకాలు, పనులు చేస్తే వారి వికాసానికి ఉపయోగపడుతాయో కూడా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులుగా ఆలోచించి, రూపొందించాలన్నారు.
గిరిజన ప్రాంతాల్లోని నిరక్షరాస్యత నిర్మూలించేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ గారు చెప్పిన ఈచ్ వన్ టీచ్ వన్ పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలన్నారు.
ఏటూరు నాగారం ఐటీడీఏ అధికారి మేడారం వెళ్లి జాతర అనంతర పనులు, పారిశుద్ధ్యాన్ని పరిశీలించాలని సూచించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat