మీకు రేషన్ కార్డు ఉందా..?. అయితే ఇది నిజంగా శుభవార్తనే. ప్రస్తుతం దేశాన్ని కరోనా వైరస్ వణికిస్తోన్న నేపథ్యంలో రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబాలకు ఆరునెలల సరుకులను ఒకేసారి తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
కరోనా వైరస్ ప్రభావంతో జన జీవనం ఇబ్బందికరంగా మారింది. పేదలకు ఇబ్బంది కలగకుండా బియ్యం,గోధుమలు,పంచదార,నూనె తదితర వస్తువులను తీసుకునేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి రాం విలాశ్ పాశ్వాన్ వెల్లడించారు.
ఈ నిర్ణయంతో దేశంలో డెబ్బై ఐదు కోట్ల కుటుంబాలు లాభపడతాయని తెలిపారు.