Home / ANDHRAPRADESH / చంద్రబాబుకు మతిపోయే వార్త..త్వరలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామా..?

చంద్రబాబుకు మతిపోయే వార్త..త్వరలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామా..?

ఏ ముహూర్తానా టీడీపీ అధినేత చంద్రబాబు జై అమరావతి అంటూ జోలె పట్టి అడుక్కోవడం స్టార్ట్ చేశాడో..కాని పార్టీ పరిస్థితి అడుగంటికిపోయే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు అమరావతి నినాదం ఎత్తుకుని విశాఖ, కర్నూలులో రాజధానుల ఏర్పాటును వ్యతిరేకించడంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. ఇప్పటికే సీమ, ఉత్తరాంధ్రలో టీడీపీ నేతలంతా వైసీపీ చేరిలో చేరుతున్నారు.. కడప, కర్నూలు, అనంతపురం, ప్రకాశం, విశాఖ జిల్లాలలో దశాబ్దాలుగా టీడీపీలో పని చేసిన సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా సైకిల్ దిగేసి, ఫ్యాన్ గూటికి చేరుకుంటున్నారు.ఇక విశాఖలో రాజధాని ఏర్పాటు టీడీపీ కొంప ముంచుతుంది. ఇప్పటికే మాజీమంత్రి, ప్రస్తుత టీడీపీ విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావుతో సహా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఇన్‌చార్జిలంతా విశాఖలో రాజధాని ఏర్పాటును స్వాగతిస్తూ ఓ తీర్మానాన్ని చంద్రబాబుకు పంపారు.

అంతేకాదు విశాఖపై పదే పదే విషం కక్కుతూ ఎల్లోమీడియాలో దుష్ప్రచారం చేయిస్తున్న చంద్రబాబుపై టీడీపీ నేతలంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కంటే తమ ప్రాంత ప్రజల మనోభావాలే ముఖ్యమని విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఇప్పటికే విశాఖలో మాజీ ఎమ్మెల్యేలు రెహమాన్, గురుమూర్తిరెడ్డి వైసీపీలో చేరారు. వారి బాటలో మాజీమంత్రి గంటాతో సహా, వాసుపల్లి గణేష్, గణబాబు, వెలగపూడి రామ కృష్ణబాబు వంటి టీడీపీ ఎమ్మెల్యేలు త్వరలో పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందుకే ప్రజా చైతన్యయాత్ర పేరుతో విశాఖలో అడుగుపెట్టిన చంద్రబాబును ఎయిర్‌పోర్ట్ వద్ద ఉత్తరాంధ్ర ప్రజాసంఘాలు, వైసీపీ నేతలు అడ్డుకుని చెప్పులు, టమాటాలతో దాడి చేసినప్పుడు కనీసం ఎయిర్‌పోర్ట్ దగ్గరకు కూడా రాలేదు. ఎయిర్‌పోర్ట్ దగ్గర చంద్రబాబు నడిరోడ్డు మీద కూర్చుని 5 గంటల పాటు డ్రామా నడిపించినా..టీడీపీ ఎమ్మెల్యేలు అక్కడ కనిపించ లేదు.

 

కాగా మే నెలలో వైజాగ్‌లో రాజధానిని ప్రారంభించేందుకు జగన్ సర్కార్ రెడీ అవుతోంది. ఈ లోగా రాజధాని సెంటిమెంట్ పేరుతో గంటా, గణబాబు, వాసుపల్లి గణేష్‌లు టీడీపీకి గుడ్‌బై చెప్పడం ఖాయమంటూ విశాఖ జిల్లా టీడీపీలో చర్చ జరుగుతోంది. కాగా చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన వెలగపూడి కూడా పార్టీకి గుడ్‌బై చెబుతున్నట్లు వార్తలు వస్తున్నా..కచ్చితమైన సమాచారం మాత్రం లేదు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో టీడీపీ సీనియర్ నేతలంతా వైసీపీలో చేరుతుండడంతో చేరికలకు ఇదే మంచి సమయమని టీడీపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారంట..మొత్తంగా విశాఖ నగరంలో కీలకమైన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్‌బై చెప్పడం ఖాయమైంది. అయితే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరుతారా లేదా, బీజేపీలో చేరుతారా అన్నది చూడాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat