Home / CRIME / నిర్భయ కేసులో అత్యాచారం నుంచి ఉరి వరకు.. ఎప్పుడేం జరిగింది?

నిర్భయ కేసులో అత్యాచారం నుంచి ఉరి వరకు.. ఎప్పుడేం జరిగింది?

యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన నిర్భయ ఘోరకలి దోషులకు ఉరిశిక్ష అమలైంది. 2012, డిసెంబర్ 16న నిర్భయపై అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమె చికిత్స పొందుతూ డిసెంబర్ 29న మృతి చెందింది. అత్యాచారం నుంచి మొదలుకొని ఉరిశిక్ష అమలయ్యే వరకు ఎప్పుడేం జరిగింది? అనే విషయాలను ఒకసారి చూస్తే..

2012 డిసెంబర్ 16: ఫిజియోథెరపీ విద్యార్థిని(23)పై కదులుతున్న బస్సులో ఆరుగురు యువకులు కలిసి సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలి స్నేహితుడిని దారుణంగా
కొట్టి.. బస్సులో నుంచి కిందకు తోసేశారు.

2012 డిసెంబర్ 17: నిర్భయ కేసులో ప్రధాన నిందితుడైన బస్ డ్రైవర్ రామ్ సింగ్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ముకేశ్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్
కుమార్ సింగ్ తో పాటు మైనర్ ని అదుపులోకి తీసుకున్నారు.

2012 డిసెంబర్ 29: బాధితురాలు సింగపూర్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. అదే రోజు శవాన్ని ఢిల్లీకి తీసుకువచ్చారు.

2013 మార్చి 11: ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న నిందితుడు రామ్ సింగ్ తీహార్ జైల్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.

2013 ఆగస్టు 31: మైనర్ నిందితుడిని జువైనల్ జస్టిస్ బోర్డ్ దోషిగా తేల్చింది. మూడేళ్లపాటు జువైనల్ హోంకు పంపింది.

2013 సెప్టెంబర్ 13: నలుగురు నిందితులు ముకేశ్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ కుమార్ సింగ్ లను దోషిగా ఖరారు చేస్తూ, ఉరిశిక్ష విధించింది ట్రయల్ కోర్టు.

2014 మార్చి 13: ట్రయల్ కోర్టు విధించిన ఉరిశిక్షను దిల్లీ హైకోర్టు సమర్థించింది.

2014 మార్చి-జూన్: ఉరిశిక్షపై నిందితులు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు, సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకూ ఉరిశిక్షపై స్టే విధించింది.

2017 మే: ఢిల్లీ హైకోర్టు, ట్రయల్ కోర్టు విధించిన ఉరిశిక్షను సుప్రీంకోర్టు కూడా సమర్థించింది.

2018 జులై: ఉరిశిక్షను నిలిపివేయాలన్న ముగ్గురు దోషుల రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

2019 డిసెంబర్ 6: కేంద్ర ప్రభుత్వం ఒక దోషి క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి కోవింద్ దగ్గరకు పంపింది. మంజూరు చేయవద్దని సిఫారసు చేసింది.

2019 డిసెంబర్ 12: నలుగురు దోషులను ఉరి తీసేందుకు తలారిని పంపించాలని ఉత్తరప్రదేశ్ జైలు అధికారులను తీహార్ జైలు అధికారులు కోరారు.

2019 డిసెంబర్ 13: దోషులకు ఉరిశిక్ష తేదీని నిర్ణయించాలని పటియాలా హౌస్ కోర్టులో నిర్భయ తల్లి తరపున ఒక పిటిషన్ దాఖలైంది. దాంతో, నలుగురు దోషులను వీడియో
కాన్ఫరెన్స్ ద్వారా పటియాలా కోర్టులో విచారించారు.

2020 జనవరి 8: జనవరి 22 ఉదయం 7 గంటలకు నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలుచేయాలని పటియాలా కోర్టు డెత్ వారెంట్లు జారీ చేసింది.

2020 జనవరి 14: ఉరిశిక్ష నిలిపివేయాలని వినయ్ కుమార్ శర్మ, ముకేశ్ సింగ్ దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

2020 జనవరి 15: దోషి క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో దోషులకు జనవరి 22న ఉరిశిక్ష అమలు చేయలేమని దిల్లీ ప్రభుత్వం హైకోర్టుకు చెప్పింది.
2014లో సుప్రీంకోర్టు ఒక తీర్పులో రాష్ట్రపతి వైపు నుంచి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణకు గురైన తర్వాత కూడా నిందితులకు కనీసం 14 రోజుల గడువు ఇవ్వడం తప్పనిసరి అని
చెప్పింది.

2020 జనవరి 17: ముకేశ్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్‌ ను రాష్ట్రపతి తిరస్కరించారు. ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని మరోసారి డెత్ వారెంట్లు
జారీ.

2020 జనవరి 28: ముకేశ్ కుమార్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టి తీర్పును రిజర్వ్ చేసింది.

2020 జనవరి 31: దోషుల ఉరిశిక్షను తదుపరి ఆదేశాల వరకూ నిలుపుదల చేస్తున్నట్లు ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు ప్రకటించింది.

2020 ఫిబ్రవరి 2: పటియాలా కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

2020 ఫిబ్రవరి 17: దోషులకు మార్చి 3న ఉరిశిక్ష అమలుచేయాలని పటియాలా హౌస్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది.

2020 మార్చి 2: దోషి పవన్ గుప్తా దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించారు.

2020 మార్చి 5: మార్చి 20న ఉరి తీయాలని పాటియాలా హౌజ్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది.

2020 మార్చి 19: డెత్ వారెంట్‌పై స్టే విధించాలంటూ వేసిన పిటిషన్‌ను పటియాలా కోర్టు తిరస్కరించింది.

2020 మార్చి 20: అర్థరాత్రి అత్యవసరంగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. దోషుల్లో ఒకరు పెట్టుకున్న రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించింది.

2020 మార్చి 20 : ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులనూ తీహార్ జైలులో ఉరితీశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat