Home / ANDHRAPRADESH / గడప దాటని ‘సీమ’జనం..స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ

గడప దాటని ‘సీమ’జనం..స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ

కరోనా వైరస్ మరింత విస్తరించకుండా అరికట్టేందుకు ప్రజలు కూడా సహకరించాలని దేశ ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపునకు రాయలసీమ ప్రజలు స్పందించి ఆదివారం స్వచ్ఛందంగా గృహ నిర్బంధం పాటించారు. మునుపెన్నడూ లేనివిధంగా ప్రజలు కరోనా భయంతో ఇళ్లను వదిలి బయటకు రాలేదు. ఒక రోజుకు కావాల్సిన నిత్యావసర సరుకులు, కూరగాయలు, ఇతరత్రా వస్తువులను ప్రజలు ముందు రోజునే సమకూర్చుకున్నారు. అన్ని వర్గాల ప్రజలు ముందస్తు చర్యలు తీసుకుని స్వీయ గృహ నిర్బంధం పాటించారు. ఇక కరోనా మహమ్మారి వ్యాప్తిని నియంత్రించేందుకు సమాజానికి సేవ చేస్తున్న డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, తదితర ప్రభుత్వ సేవకులకు ప్రజలు సాయంత్రం 5 గంటల సమయంలో వారి ఇళ్ల ముందు నిల్చుని చప్పట్లు కొడుతూ కృతజ్ఞతలు తెలిపారు.

కర్నూలు:
కర్నూలు జిల్లా ప్రజలు కూడా తమవంతుగా జనతా కర్ఫ్యూలో పాల్గొని వైరస్‌ను ఎదుర్కొనేందుకు తాము సైతం అంటూ సంఘీభావం తెలిపారు. జిల్లాలో మారుమూల గ్రామం నుంచి కర్నూలు నగరం వరకూ వ్యవసాయ కూలీ నుంచి జిల్లా కలెక్టర్ వరకూ జనత కర్ఫ్యూలో భాగస్తులయ్యారు. జిల్లాలో ఎక్కడా కూడా జనసంచారం లేకుండా వీధులన్నీ బోసిపోయాయి. ఇక వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మరికొద్ది రోజులు ఇలాగే వుంటే బాగుంటుందన్న వైద్య నిపుణుల సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకూ అత్యవసర సర్వీసులు మినహా అన్నీ బంద్ చేయాలన్న ప్రకటనకు సైతం ప్రజలు సంఘీభావం తెలుపుతున్నారు. కరోనా వైరస్ ధాటిని ఎదుర్కొనేందుకు రెండురోజుల క్రితమే జిల్లాలోని ప్రముఖ ఆలయాలైన శ్రీశైలం, మహానంది, యాగంటి, మంత్రాలయం మఠం వంటి పుణ్య క్షేత్రాల్లో భక్తులకు దర్శన భాగ్యాన్ని రద్దు చేశారు.

అనంతపురం :
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని పారదోలేందుకు జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో ఆదివారం అనంతపురం జిల్లాలో ప్రజలు స్వచ్ఛందంగా సంపూర్ణంగా మద్దతు ఇచ్చి విజయవంతం చేశారు. జనం అందరూ ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకూ ఇళ్లకే పరిమితమై గడప దాటి బయటకు రాకుండా స్వీయ నిర్బంధంలో ఉండిపోయారు. ఈ స్ఫూర్తితో కరోనా వ్యాధి సంక్రమణ గొలుసును తెంపేసేందుకు మరికొన్ని రోజులు కూడా సహకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించడం విశేషం. జిల్లా కేంద్రమైన అనంతపురం నగరంతో పాటు పట్టణాలు, మండల కేంద్రాలు, పంచాయతీలు మొదలు మారుమూల గ్రామాల వరకూ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా జనతా కర్ఫ్యూకు సహకరించారు.
కడప:
ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు కడప ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటించారు. మీడియాలో కరోనా వైరస్ ప్రభావం, ప్రమాదంపై విస్తృతంగా ప్రచారం జరగడంతో ప్రజల్లో ఒక రకమైన భయం ఏర్పడి 95శాతం మంది ప్రజలు స్వచ్ఛందంగానే ఇళ్లకు పరిమితమయ్యారు. ఆదివారానికి అవసరమైన నిత్యావసర వస్తువులు శనివారమే కొనుగోలు చేశారు. ఏ పూటకు ఆ పూట నిత్యావసర వస్తువులు కొనే భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లు, కూలీలు వంటి వారు కూడా ఈ జనతా కర్ఫ్యూకు సహకరించడం విశేషం. అయితే ఉదయం 7 తర్వాత కూడా అక్కడక్కడ కొంతమంది జనం బయట కనిపించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat