Home / NATIONAL / కేంద్రం గుడ్ న్యూస్..లక్షా 70 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన !

కేంద్రం గుడ్ న్యూస్..లక్షా 70 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన !

కరోనా నేపథ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం గురువారం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది.  ఈ మేర‌కు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కరోనా బాధితుల కోసం సుమారు రూ.1,70,000 కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. ప్ర‌ధానంగా క‌రోనా వ‌ల్ల న‌గ‌రాలు, గ్రామీణ ప్రాంతాల్లో ప‌ని చేసే 80 కోట్ల ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన‌మంత్రి గరీబ్ క‌ల్యాణ్ ప‌థ‌కం ద్వారా ప్యాకేజీని అందిస్తామ‌న్నారు. కోవిడ్-19 వ‌ల్ల కార్మికులు ఆక‌లితో అల‌మ‌టించ‌కుండా ఉండేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలిపారు. ప్ర‌తిఒక్క‌రికీ ఐదు కిలోల బియ్యం లేదా గోధుమ‌ల‌తో పాటు అద‌నంగా వారికి కావాల్సిన కిలో ప‌ప్పును వ‌చ్చే మూడు నెల‌లు అంద‌జేస్తామ‌ని చెప్పారు.

న‌రేగా కింద దిన‌స‌రి కూలీని రూ.182 నుంచి రూ.202కు పెంచుతున్నామ‌ని, దీని ద్వారా దాదాపు ఐదు కోట్ల మందికి లాభం క‌లుగుతుంద‌ని చెప్పారు. క‌నీసం వీరి ఆదాయం రూ.2000 దాకా పెరుగుతుంద‌న్నారు. నిరుపేద వృద్ధులు, వితంతువులు, విక‌లాంగుల‌కు రెండు వాయిదాల చొప్పున రూ.1000ను అంద‌జేస్తామ‌ని, వీటి ద్వారా సుమారు మూడు కోట్ల మంది ప్ర‌జ‌ల‌కు ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌న్నారు. దేశంలో ఉన్న 20.5 కోట్లు గ‌ల మ‌హిళ‌ల జ‌న్ ద‌న్ ఖాతాలో నెల‌కు రూ.500 చొప్పున నేరుగా సొమ్మును జమ‌చేస్తామ‌ని వెల్ల‌డించారు.

క‌రోనా బాధితుల‌కు వైద్య‌సాయం అందించే ప్ర‌తి ఆరోగ్య సిబ్బందికి సుమారు రూ.50 ల‌క్ష‌ల బీమా సౌక‌ర్యాన్ని వ‌చ్చే మూడు నెల‌ల దాకా క‌ల్పిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇందులో డాక్ట‌ర్లు, పారామెడిక‌ల్‌, ఆరోగ్య సిబ్బంది, క‌రోనా కోసం ప‌ని చేసే ఆశా వ‌ర్క‌ర్లు.. ఇలా మొత్తం ఇర‌వై ల‌క్ష‌ల మంది ప్ర‌యోజ‌నం పొందుతార‌ని వివ‌రించారు.

సంఘ‌టిత రంగంలో ప‌ని చేసే ఉద్యోగుల‌కు వ‌చ్చే మూడు నెల‌ల కాలానికి కేంద్ర ప్ర‌భుత్వ‌మే 24 శాతం ఈపీఎఫ్ చెల్లిస్తుంద‌ని నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించారు. వంద ఉద్యోగులు ఉన్న సంస్థ‌ల్లో, దాదాపు తొంభై శాతం మంది జీతం నెల‌కు రూ.15,000 లోపు ఉన్న‌వారికి ఇది వ‌ర్తిస్తుంద‌న్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat