టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో..తెలుగు సినిమా నట సింహం ..యువరత్న.. నందమూరి అందగాడు.. బాలకృష్ణ హీరోగా ప్రముఖ మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా రాబోతున్న విషయం మనకు తెలిసిందే.
ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇప్పటికే ఒక హీరోయిన్ గా అంజలిని ఫైనల్ చేసింది చిత్రం యూనిట్. అయితే తాజగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో శ్రియా సరన్ ను ఓ కీలక పాత్ర కోసం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే శ్రియా ఇటీవల బాలయ్య సరసన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ అనే చారిత్రక నేపథ్యమున్న సినిమాలో కలిసి నటించింది.