ప్రపంచ ప్రజలు మాస్కుల కోసమో, హ్యాండ్ శానిటైజర్ల కోసమో మాత్రమే కాదు… కండోమ్‌ల కోసం కూడా ఎగబడుతున్నారు. షాపుల్లో ఎక్కడ ఎలాంటి కండోమ్ ప్యాకెట్లు కనిపిస్తున్నా… మళ్లీ దొరుకుతాయో లేదో… ఎందుకైనా మంచిది ఇప్పుడే స్టాక్ పెట్టుకుందామని ఎక్కువెక్కువ కొనేసుకుంటున్నారు. అన్ని దేశాల్లోనూ ఇలాగే జరుగుతోంది. ప్రపంచంలో ప్రతి ఐదు కండోమ్‌లలో ఒకటి మలేసియాకి చెందిన కారెక్స్ BHD కంపెనీ తయారుచేస్తుంది. ఆ కంపెనీ లెక్కల ప్రకారం… వచ్చే 2 నెలల్లో కండోమ్‌లకు 50 శాతం కొరత ఏర్పడ నుంది. ఎందుకంటే… ఆ కంపెనీ తయారుచేస్తున్న కండోమ్‌ల స్టాక్ దాదాపు అయిపోవచ్చిందట. అంతలా ప్రజలు అవి కొనేస్తున్నారు. ఇదే సమయలో కరోనా కారణంగా… కారెక్స్ కంపెనీలో ఉద్యోగుల సంఖ్యను సగానికి తగ్గించారు. అందువల్ల ఉత్పత్తి సగానికి తగ్గింది. ఇటు ఉత్పత్తి తగ్గడం, అటు డిమాండ్ పెరగడంతో… కండోమ్‌ల కొరత ఏర్పడుతోంది. మీకు తెలుసా… ప్రపంచంలో కండోమ్‌లు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేది ఇండియా, చైనాలోనే. ఇప్పుడీ రెండు దేశాలపైనే ఎక్కువ ప్రభావం పడనుంది. ఇక్కడే కండోమ్‌ల కొరత ఎక్కువగా ఏర్పడనుంది.
కండోమ్‌లను స్టాక్ పెట్టుకోవడం ఓ కారణమైతే… బలమైన మరో కారణం కూడా ఉంది. ఎప్పుడైతే ప్రపంచ దేశాలన్నింటికీ కరోనా వైరస్ వ్యాపించిందో… మనకు భవిష్యత్ ఉంటుందా అని చాలా మంది ప్రజలు టెన్షన్ పడుతున్నారు. ఇలాంటి సమయంలో… మనకు పిల్లలు ఇప్పుడు అవసరమా… అని అనుకుంటున్నారు. కొన్నాళ్ల తర్వాత కనొచ్చులే అనుకుంటూ వాయిదా వేసుకుంటున్నారు. ఈ క్రమంలో కండోమ్‌ల వాడకం పెరుగుతోంది. పిల్లలు పుడితే… కరోనా వైరస్ నుంచీ వాళ్లను కాపాడుకోవడం కష్టమే అనే ఆలోచన కూడా వారిని కండోమ్‌ల వైపు చూసేలా చేస్తోంది.
కారెక్స్ కంపెనీ… ఏటా 140 దేశాలకు 500 కోట్ల కండోమ్‌లను సప్లై చేస్తోంది. ఇప్పుడు చాలా దేశాలు విమాన సర్వీసులు ఆపేయడంతో… కండోమ్‌ల సప్లై ఆగిపోతోంది. అదే సమయంలో ఆ దేశాల్లో ప్రజలు పాండెమిక్ (ఇక దొరకవేమోనన్న భయం) భయంతో ఎక్కువగా కొనేసుకుంటున్నారు. అందువల్ల రెండు నెలల్లో కరోనా కంట్రోల్ కాకపోతే… కండోమ్‌ల కొరత తప్పదనే సంకేతాలొస్తున్నాయి.