ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహామ్మారి మొత్తం ఏడు లక్షల మందికి సోకింది.ఇందులో దాదాపు ముప్పై మూడు వేల మృతి చెందారు.అయితే కరోనా వైరస్ లక్షణాలున్న వ్యక్తి తుమ్మినప్పుడు కానీ దగ్గినప్పుడు కానీ ఇతరులకు వ్యాప్తి చెందుతుంది.
అయితే గాలి ద్వారా ఇది వ్యాప్తి చెందుతుందా అనే పలు అనుమానాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరణ ఇచ్చింది.గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందన్న వార్తల్లో ఎలాంటి నిజంలేదు .అవన్నీ వట్టి పుఖార్లే.
కరోనా వైరస్ లక్షణాలున్న వ్యక్తి తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు ఆ వ్యక్తి యొక్క తుంపర్ల వలన కరోనా ఇతరులకు వ్యాప్తి చెందుతుంది.కరోనా ఉన్న వ్యక్తిని తాకినప్పుడు కానీ ఆ వ్యక్తి వాడిన వస్తువులను వాడినప్పుడు ఇది వస్తుంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చి చెప్పింది.