తెలంగాణ రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య పెరిగింది.ఏకంగా ఆరుగురు ఈ వైరస్ బారీన పడి మృత్యువాత పడ్డట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
అయితే ఈ మృతులంతా దేశ రాజధాని ఢిల్లీ నిజాముద్ధీన్ పరిధిలోని మర్కజ్ లో మార్చి 13-15 జరిగిన ఒక మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్నట్లు ప్రభుత్వం తెలిపింది.
గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు,అపోలో,గ్లోబల్ ఆస్పత్రిలో ఒక్కొక్కరు,నిజామాబాద్,గద్వాలలో ఒక్కొక్కరు మృతి చెందినట్లు తెలుస్తుంది.