Home / ANDHRAPRADESH / కరోనా పై పోరు.. నిపుణుడిని రంగంలోకి దించిన జగన్ సర్కార్

కరోనా పై పోరు.. నిపుణుడిని రంగంలోకి దించిన జగన్ సర్కార్

కరోనా కేసులు పెరుగుతండటంతో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్ కే శ్రీనాథ్‌రెడ్డిని పబ్లిక్ హెల్త్ అడ్వైజర్‌గా నియమించింది. ఆయన గతంలో ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఢిల్లీలో కార్డియాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా పనిచేశారు. శ్రీనాథ్‌రెడ్డికి వైద్యుడిగా అపార అనుభవం ఉండటంతో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అయన ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమవనున్నారు.

ఈనెల 13-15వ తేదీల మధ్య ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన జర్కత్ మత ప్రార్ధనలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో సుమారు 2 వేలమంది పాల్గొన్నారు. వీరిలో 500 మంది ఏపి నుండే హాజరయ్యారు. ఇపుడీ విషయమై ఏపిలో సంచలనంగా మారింది. పైగా పాల్గొన్న 500 మందిలో అనంతపురం, కడప, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఉభయగోదావరి, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల వారు ఉన్నారు.
ఏపిలో ఈ ఒక్కరోజే 17 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 40కి చేరుకుంది.

ఒక్కరోజులో ఇన్ని కేసులు బయటపడటానికి ప్రధాన కారణం ఢిల్లీ యాత్రే అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరికీ కరోనా వైరస్ సోకిందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. వీళ్ళకు సోకటమే కాకుండా వీళ్ళ ద్వారా కుటుంబసభ్యులకు అలాగే వీళ్ళు కలిసిన వాళ్ళకు కూడా సోకే ప్రమాదం లేకపోలేదనే ఆలోచన ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల నేపథ్యంలోనే కరోనా కట్టడికి డాక్టర్ కే శ్రీనాథ్‌రెడ్డిని పబ్లిక్ హెల్త్ అడ్వైజర్‌గా జగన్ ప్రభుత్వం నియమించింది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat