Home / Uncategorized / వైద్యులకు,పోలీసులకు సీఎం కేసీఆర్ శుభవార్త

వైద్యులకు,పోలీసులకు సీఎం కేసీఆర్ శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలోని వైద్యులకు,ఇతర మెడికల్ నాన్ మెడికల్ సిబ్బందికి,పోలీసులకు ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభవార్తను తెలిపారు.గత నెల రోజులుగా రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి విధితమే.ఇప్పటివరకు గురువారం ఉదయం వరకు మొత్తం 127కేసులు నమోదు కాగా ఇందులో తొమ్మిది మంది మృత్యు వాత పడ్డారు.

అయితే తమ ప్రాణాలకు సైతం తెగించి కరోనా బాధితులకు చికిత్సను అందిస్తున్న వైద్యులు,మెడికల్,నాన్ మెడికల్ సిబ్బందికి,లాక్ డౌన్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న పోలీసు సిబ్బందికి మార్చి నెల జీతం ఫుల్ గా ఎలాంటి కోతల్లేకుండా ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

మరోవైపు ఫుల్ జీతంతో పాటు మార్చి నెల ఇన్సింటెవ్ కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.అయితే కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతం కోతలు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించిన సంగతి విదితమే.