Home / EDITORIAL / అంబేద్కర్ గురించి ఆసక్తికర విషయాలు

అంబేద్కర్ గురించి ఆసక్తికర విషయాలు

 

భారత రాజ్యాంగ పితామహుడు అంబేద్కర్ గురించి ఆసక్తికర విషయాలు

1) భారతదేశ పురోగమనానికి కృషి చేసిన గొప్ప సంస్కరణవాదుల్లో అంబేద్కర్ ఒకరు..భారతదేశంలోని దళితులు,అణగారిన వర్గాలకు మహామురుషుడు,భారతదేశంలోని అతిగొప్ప నాయకుల్లో ఒకరు..ఇతర దిగువ కులాల వారి సమానత్వం కోసం పోరాడారు..అన్నిటికంటే ముఖ్యమైంది ఈయన రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకు మూల పురుషుడు బాబాసాహేబ్ గారు..

2) విదేశాల్లో ఎకనామిక్స్ లో డాక్టరేట్ పీహెచ్ డీ పూర్తి చేసిన మొదటి భారతీయుడు అంబేద్కరే..అంతేకాదు దక్షిణాసియాలో ఎకనామిక్స్ లో డబుల్ డాక్టరేట్ పట్టా పొందిన తొలి వ్యక్తి కూడ ఈయనే..తన తరం భారతీయుల్లో ఎక్కువగా చదివింది కూడా సాహేబ్ గారే..

3) భారత దేశ కేంద్ర బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..అంబేద్కర్ ఆలోచనల్లో నుంచే పుట్టీంది..రాయల్ కమీషన్ ఆన్ ఇండియన్ కరెన్సి,ఫైనాన్స్ కు అంబేద్కర్ సలహాలు,సూచనలు ఇచ్చిన తర్వాతే RBI ఏర్పడింది..

4) అంబేడ్కర్ 1935 – 36 లో రాసిన 20పేజిల ‘వెయిటింగ్ ఫర్ ఎ వీసా’ అనే ఆత్మకథ కొలంబియా యూనివర్శిటిలో పాఠ్య పుస్తకంగా ఉంది..ఆ విశ్వవిద్యాలయం 2004 లో ప్రపంచంలోని టాప్ 100 విద్యావంతుల జాబితాను విడుదల చేసింది. అందులో అంబేద్కర్ గారి పేరు మొదటి స్థానంలో ఉండటం విశేషం.

5) భారత రాజ్యంగంలో జమ్మూకాశ్మీర్ సంబందించిన ఆర్టికల్ 370 ని చేర్చడాన్ని బాబా సాహేబ్ తిరస్కరించారు.అది భారతదేశ మూల సూత్రాలకు,ఏకత్వానికి,సమైక్యతకు వ్యతిరేకమని వాదించారు.

6) బాబా సాహేబ్ గారి కృషి వల్లే భారతదేశ జెండాలో అశోక చక్రాన్ని చేర్చారు.జాతీయ జెండాను రూపొందించది మాత్రం పింగళి వెంకయ్య గారు.

7) మద్యప్రదేశ్,బిహార్ అబివృద్దిని కాంక్షించి 1950లలో రాష్ట్రాల విభజనను ప్రతిపాదించారు.అప్పుడు ఆ సలహాను ఎవరు పట్టించుకోలేదు.కాని చివరకు 2000 సంవత్సరంలో అప్పటి ప్రదాన మంత్రి వాజ్ పెయ్ దాన్ని పాటిస్తూ బీహార్ నుంచి కొత్తగా జార్ఖండ్, మద్యప్రదేశ్ నుండి చత్తీస్ ఘడ్ ను ఏర్పాటు చేశారు..

8) బాబాసాహేబ్ గ్రంథాలయం ‘రాజ్ గృహ’ లో యాబై వేలకు పైగా పుస్తకాలున్నాయి.ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ గ్రంథాలయంగా గుర్తింపు పొందింది..

9) బాబా సాహేబ్ గారు 64 సబ్జెక్టుల్లో ప్రావీణ్యుడు..అంబేద్కర్ కు హింది,పాలి,సంస్కృతం,ఇంగ్లీష్,ఫ్రెంచ్,జర్మన్,మరాఠీ,పర్షీయన్,గుజరాతీ భాషలు వచ్చు.అంతేకాదు ఈ ప్రపంచంలోని అన్ని మతాల గురించి 21 ఏళ్ళలో చదివారు..

10) లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో 8ఏళ్ళ చదువును బాబాసాహేబ్ కేవలం 2 సంవత్సరాల 3నెలల్లోనే పూర్తిచేసారు.ఇందుకోసం రోజుకు 21గంటలపాటు చదివేవారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat