Home / TELANGANA / రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదు..!!

రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదు..!!

గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు కావడంతో తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అయ్యింది.అలాంటి రాష్ట్రంలో రైతులకు ఆన్యాయం జరిగే సహయించేది లేదని ఆర్యోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్ఫష్టం చేశారు. రైతులను ఇబ్బందులను పెట్టే వ్యాపారులపై అగ్రహం వ్యక్తం చేశారు.అరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చి అమ్ముదామంటే కరోనా అడ్డురావడంతో అన్ని కష్టలను దిగమింగుకోని అమ్మితే కొంతమంది రైస్ మిల్లర్ల తాలు,తరుగు పేరుతో కిలోల కొద్ది కోత విదిస్తూ రైతులను మోసం చేస్తూన్నారని అవేధన వ్యక్తం చేశారు.రైతులను మోసం చేసై సహించేది లేదని హెచ్చించారు.ఇక నుండి రైతులపై దాడులు.వారిని అవమాన పరిచిన ప్రభుత్వం ఊరుకోదని స్పష్టం చేశారు.

హుజురాబాద్ లోని రైస్ మిల్లు యాజమాని రైతులను ఉద్దేశించి అవమనకరంగా ప్రవర్తించడం,రైతులను చిన్నచూపు చూస్తూన్నారని, కేజీల కొద్ది కోత పెడుతున్నారని తెలిసిన మంత్రి ఈటెల రాజేందర్ ఎర్రటి ఎండలో హుట హుటిన జమ్మికుంట మండలం తనుగుల కు చేరుకున్నారు.ధాన్యం పరిశీలించి అక్కడే వేప చెట్ల కిందనే రైతులు,స్థానిక నాయకులతో సమావేశం అయ్యారు.రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంబందిత రైస్ మిల్లులో 40 కేజీల బస్తాలో 4 నుండి 5 కేజీలు తాలు ఉందనే పేరుతో కోత విధిస్తూన్నారని,ఇలా ఎందుకు చేస్తూన్నారి ప్రశ్నిస్తే అవమానిస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకు రావడంతో, మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎప్పడు మృదు స్వభావిగా ఉండే మంత్రి ఈటల రాజేందర్ అగ్రహం వ్యక్తం చేశారు.అంతేకాక రైతులకు జరుగుతున్నా అన్యాయం పై అవేదన వ్యక్తం చేశారు.తక్షణం అక్కడినుండే యుద్ద ప్రాతిపదికన రైస్ మిల్ అస్సోషియేషన్స్ తో, వ్యవసాయ శాఖ అధికారులతో, సివిల్స్ సప్లయ్ శాఖ కమిషనర్ తో, కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడారు. రైతులను మోసం చేస్తూ వారిని అవమాన పారుస్తూన్నా సదరు మిల్లులకు ధాన్యం కేటాయించవద్దని ఆదేశించారు.ఇలాంటి చర్యలు పాల్పడే రైస్ మిల్లు వ్యాపారులను ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుందని హెచ్చించారు.

గౌరవ ముఖ్య మంత్రి కెసిఆర్ గారి ఆలోచన రైతులను సంతోషంగా ఉంచడమే ప్రధాన ఏజెండా అయినప్పడు.అందుకు భిన్నంగా ఎవరు వ్యవహరించినా క్షమించేది లేద స్పష్టం చేశారు.కొంతమంది మిల్లర్లు రైతులను ఇబ్బందిపడుతున్నరని
తనకి కంప్లయింట్ వచ్చిందని, అలా చేస్తే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.మిల్లర్లు ప్రభుత్వం తో కొట్లాడి రాయితీలు, మద్దతు తీసుకోవాలి కానీ రైతులను గొసపుచ్చుకోడం, మోసం చేయడం తగదని హితువు పలికారు.
రైతుల వల్ల మిల్లర్లు బ్రతుకుతున్నారు అనే విషయం గుర్తు పెట్టుకోవాలని అన్నారు. కాళేశ్వరం నీళ్ళు రావడంతో భూమికి బరువయ్యేంత పంట పందిందని రైతులు సంతోషంగా ఉన్నారని వారిని ఇబ్బంది పెట్టవద్దని మంత్రి వ్యాపారులకు విజ్జాప్తి చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat