Home / SLIDER / పాముల పార్కు ప్రారంభం

పాముల పార్కు ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అభివృద్ధి కిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరింది. తాజాగా హైదరాబాద్ లో పాముల పార్కును ఏర్పాటు చేశారు. నగరం పరిధిలోని బౌరంపేట రిజర్వు ఫారెస్టులో రూ.1.40కోట్ల వ్యయంతో పాముల సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఈ పార్కును ఈ రోజు ప్రారంభించారు. అనంత‌రం ఆయన మాట్లాడుతూ.. ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్సవం సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపారు. జీవకోటి మనుగడకు జీవనాధారమైన పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.‌ పర్యావరణాన్ని కాపాడ‌టం ప్రతి ఒక్కరి భాద్యత అని తెలిపారు. జీవవైవిధ్యంలో అనేక జీవరాశుల మనుగడకు పర్యావరణ సమతుల్యతలే ప్రధానంగా తోడ్పడుతాయన్నారు. ఒక జీవి మనుగడ మరో జీవి మనుగడకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపయోగ పడటం వల్లనే సకల జీవులు మానవాళిలో మనుగడ సాగిస్తున్నాయన్నారు. జీవ‌వైవిధ్య చక్రంలో ఒక బంధం తెగితే దాని ప్రభావం అనేక రూపాల్లో కనిపిస్తాయని, పాములు నాశనమైతే ఎలుకలు, క్రిమి కీటకాలు సంతతి అనుహ్యంగా పెరిగిపోతుందని చెప్పారు. దానితో అవి పంటలపై పడి తిండి గింజలను తినేస్తాయని అందుకే సృష్టిలోని ఏజాతి ఉనికైనా జీవ వైవిధ్యం ఎంతో అవసరమ‌న్నారు. జీవవైవిధ్యాన్ని పెంపొందించడంలో భాగంగా చెన్నైలోని గిండి స్నేక్ పార్క్ కు ధీటుగా స‌ర్పాల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశార‌న్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రంలో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా పట్టుకున్న సర్పాల సంరక్షణ, అలాగే వివిధ రకాల సర్పాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇది ఎంతగానో ఉయోగపడుతుందని తెలిపారు. ఎవరైకైనా పాములు కనిపిస్తే, వాటికి హాని తలపెట్టకుండా ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ (రెస్క్యూ టీం) వారికి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు.

Image may contain: 2 people

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat