Home / MOVIES / బాలీవుడ్ కు అందుకే దూరం-రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ కు అందుకే దూరం-రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు

దక్షిణాదిన స్టార్ హీరోలందరితోనూ నటించి అగ్ర కథానాయికగా వెలుగొందారు సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ. హీరోయిన్ నుంచి క్యారెక్టర్ రోల్స్‌కు మారిన తర్వాత కూడా ఆమె మంచి అవకాశాలు దక్కించుకుంటున్నారు.

ఇటీవల `బాహుబలి`తో ఉత్తరాదిన కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. పూరీ జగన్నాథ్ రూపొందిస్తున్న పాన్ ఇండియా సినిమా `ఫైటర్`తో మరోసారి బాలీవుడ్‌ను పలకరించబోతున్నారు.

నిజానికి హీరోయిన్‌గా రమ్యకృష్ణ పలు బాలీవుడ్ సినిమాల్లో నటించారు. `క్రిమినల్`, `కల్‌నాయక్`, `బడేమియా చోటేమియా` వంటి హిందీ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత క్రమంగా బాలీవుడ్‌కు దూరమై దక్షిణాది చిత్రాలపైనే దృష్టి సారించారు.

దీని గురించి రమ్యకృష్ణ తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడారు. `నేను బాలీవుడ్‌లో విజయవంతం కాలేకపోయాను. నా చిత్రాలేవీ అక్కడ మంచి ఆదరణ సంపాదించలేకపోయాయి. దాంతో నాకు అక్కడి నుంచి మంచి అవకాశాలు రాలేదు. అందుకే బాలీవుడ్‌కు దూరమయ్యా. దక్షిణాదిన మాత్రం మంచి సినిమాలు చేశాన`ని రమ్యకృష్ణ తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat