Home / MOVIES / టాలీవుడ్ ప్రముఖుడికి కరోనా పాజిటీవ్..?

టాలీవుడ్ ప్రముఖుడికి కరోనా పాజిటీవ్..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ కు కరోనా పాజిటివ్ వచ్చిందన్న సమాచారం మీడియాలో వచ్చింది.

బండ్ల గణేష్ హెయిర్ ప్లాంటేషన్ కోసం వెళ్లగా డాక్టర్లు మొదట కరోనా టెస్ట్ చేసుకోవాలని సూచించారు.ఆ మీదట ఆయన కరోనా టెస్ట్ చేయించుకున్నారు.

ఈ పరీక్షలో  పాజిటివ్ వచ్చినట్టు మీడియా కదనంగా ఉంది. ప్రస్తుతం బండ్ల గణేష్‌ను క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్టు ఆ వార్త తెలిపింది.

దీంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఆయనతో సన్నిహితంగా ఉన్నవాళ్లు కూడా టెస్టులు చేయించుకుంటున్నారు.