యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ కొత్త లుక్లో కనిపించి అందర్నీ సర్ప్రైజ్ చేశారు. ఫాదర్స్ డే సందర్భంగా ఆయన తన తండ్రితో కలిసి తీసుకున్న ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు.
‘నేను ఏ నిర్ణయం తీసుకున్నా.. తప్పులు చేసినా.. రిస్క్ తీసుకున్నా.. సాహసాలు చేసినా.. పోరాడినా.. నీ వెంట నేనున్నానని నాన్న ధైర్యం చెప్పేవారు. ఫాదర్స్ డే శుభాకాంక్షలు డాడీ.. ఐ లవ్ యూ..’ అని విజయ్ పోస్ట్ చేశారు.
అయితే అందులో ఆయన పూర్తి విభిన్నమైన లుక్లో కనిపించారు. జుట్టు పెంచుకుని, ప్రత్యేకమైన గడ్డంతో కనిపించారు.
దీంతో ఈ ఫొటో కాస్త వైరల్గా మారింది. అంతేకాదు ఆయన తన సన్నిహితులతో తీసుకున్న ఫొటోలు కూడా సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.