Home / MOVIES / నటి స‌మంత ఫ్రెండ్‌కి క‌రోనా..

నటి స‌మంత ఫ్రెండ్‌కి క‌రోనా..

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌ల్లోలం సృష్టిస్తున్న క‌రోనా రీసెంట్‌గా టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టింది. న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్‌కి క‌రోని పాజిటివ్ రావ‌డంతో అంద‌రు ఉలిక్కి ప‌డ్డారు.

ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం కుదుట‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తుంది. క‌ట్‌చేస్తే సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత అత‌ని భ‌ర్త నాగ‌చైతన్య‌కి క‌రోనా సోకిందా అనే అనుమానాలు వ్య‌క్త‌మవుతున్నాయి.

స్టార్ యాక్ట్రెస్ స‌మంత కొద్ది రోజుల క్రితం త‌న ఫ్రెండ్, పాపుల‌ర్ ఫ్యాష‌న్ డిజైన‌ర్ శిల్పారెడ్డి బుగ్గ‌పై గ‌ట్టిగా ముద్దు పెడుతున్న ఫోటోని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇది షేర్ చేసిన కొద్ది రోజుల‌కే శిల్పాకి క‌రోనా పాజిటివ్ అని తేలింది.

దీంతో స‌మంత‌, నాగ‌చైత‌న్య ఆరోగ్య‌ప‌రిస్థితి గురించి అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. అయితే స‌మంత పోస్ట్ చేసిన ఫోటో గ‌తంలోదా లేదంటే రీసెంట్ ఫోటోనా అనే విష‌యంలో క్లారిటీ కోసం ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.