Home / SLIDER / మొక్కలు నాటిన నరేష్

మొక్కలు నాటిన నరేష్

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ మూడవ విడత లో భాగంగా సినీ దర్శకులు సతీష్ వేగేశ్న విసిరిన చాలెంజ్ స్వీకరించి నానక్ రాం గూడ లో తన నివాస ప్రాంగణం విజయ కృష్ణ ఎస్టేట్ లో మొక్కలు నాటిన సీనియర్ నటులు, మా అధ్యక్షుడు నరేష్ విజయకృష్ణ..

కాంక్రీట్ ఇండియా తో పాటు గ్రీన్ ఇండియా తయారు చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని ఈ గ్రీన్ ఇండియా మూమెంట్ ను ఎంపీ సంతోష్ గారు ప్రారంభించడం చాలా అభినందనీయమని నరేష్ అన్నారు.సామాజిక సేవకుడుగా ,రైతుగా పచ్చదనాన్ని ప్రేమించే వ్యక్తిగా దీన్ని చాలా అద్భుతంగా ముందుకు తీసుకువెళుతున్నారని నటుడిగా ఓ రైతుగా చాలా ఆనందంగా ఉందని అన్నారు.

ఈరోజు మా అమ్మగారి గార్డెన్ లో మొక్క నాటడం చాలా ఆనందంగా ఉందని
గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతంగా ముందుకు వెళుతుందని గ్రీన్ ఇండియా చాలెంజ్ లో నేను ఓ కొమ్మను అని ఎటువంటి సేవ చేయడానికైనా సిద్ధమే అని నటుడు ,మా అధ్యక్షుడు నరేష్ అన్నారు. అనంతరం ఈ చాలెంజ్ లో భాగస్వామ్యం అవ్వాల్సిందిగా నటి జయసుధ ,నటులు రాజీవ్ కనకాల,శివబాలాజీ ముగ్గురిని కోరుతున్న..
ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధి సుబ్బరాజు,నటుడు కృష్ణుడు పాల్గొన్నారు..