Home / SLIDER / తెలంగాణలో 2,384 కరోనా కేసులు

తెలంగాణలో 2,384 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో శనివారం (22వ తేదీన) 2,384 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,04,249కి చేరింది.

ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 11 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 755కి చేరింది.

కరోనా బారి నుంచి నిన్న 1,851 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 80,586కి చేరింది.

రాష్ట్రంలో ప్రస్తుతం 22,908 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు నిర్వహించిన కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల సంఖ్య 9,31,839కి చేరింది. జీహెచ్‌ఎంసీలో నిన్న అత్యధికంగా 472 కేసులు నమోదయ్యాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat