Home / MOVIES / హారిక ఓవర్ యాక్షన్

హారిక ఓవర్ యాక్షన్

బిగ్ హౌస్‌లో జ‌రుగుతున్న‌ అల్ల‌ర చివ్వ‌ర య‌వ్వారాల‌కు బిగ్‌బాస్ ఫుల్‌స్టాప్ పెట్టాడు. కంటెస్టెంట్ల‌తో ఫిజిక‌ల్ టాస్క్ ఆడించాడు. తొలిసారి టాస్క్ ఇచ్చాడు కాబ‌ట్టి, అంద‌రూ త‌మ శ‌క్తి మేర క‌ష్ట‌ప‌డ్డారు. ఆ త‌ర్వాత బిగ్‌బాస్ దివికి ప్ర‌త్యేక‌ టాస్క్ ఇచ్చాడు. టాస్క్‌లో భాగంగా దివి వైద్య తానేం అనుకుంటుందో ఉన్న‌దున్న‌ట్టుగా అంద‌రి మొహం మీదే చెప్పింది.

అయితే ఆమె చెప్పిన‌దాన్ని కొంద‌రు అంగీక‌రించ‌క‌పోయిన‌ప్ప‌టికీ ఎలాంటి వాదులాట జర‌గ‌క‌పోవ‌డం విశేషం. నేటి ఎపిసోడ్‌లో జ‌‌రిగిన హైలెట్స్‌ను ప‌రిశీలిస్తే..

బిగ్‌బాస్ మార్నింగ్ మ‌స్తీలో దివికి టాస్క్ ఇచ్చాడు. త‌ను ఇంటిస‌భ్యుల‌ను ఏ విష‌యంలో మార్చాల‌ని అనుకుంటుందో చెప్పాల‌న్నాడు. దీంతో టాస్క్ ప్రారంభించిన దివి అఖిల్ మోడ‌ల్ అని‌.. అత‌ని వాకింగ్ స్టైల్ కూడా అలానే ఉంటుంది. కాబ‌ట్టి అది మార్చుకుంటే మంచిది అని చెప్పింది.

ప‌క్క‌వాళ్లు ఏడిస్తే క‌న్నీళ్లు పెట్టుకోవ‌ద్ద‌ని గంగ‌వ్వకు సూచించింది. ఏడ‌వ‌ద్దంటే తన వ‌ల్ల‌కాద‌ని గంగ‌వ్వ కాస్త క‌టువుగా స‌మాధాన‌మివ్వ‌గా, ఏడిస్తే తామెవ‌రం చూడ‌లేం అంటూ అవ్వ‌ను కూల్ చేశారు.

ఆ త‌ర్వాత అభిజిత్‌.. కోపం త‌గ్గించుకుంటే బాగుంటుంద‌ని స‌ల‌హా ఇచ్చింది. లాస్య సెన్సిటివ్ అని చెప్ప‌గా తాను అలాంటిదాన్ని కాన‌ని కొట్టిపారేసింది. హారిక అంద‌రినీ నువ్వు అని సంబోధిస్తుంది, కాక‌పోతే కొంద‌రికైనా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే మంచిదని చెప్పింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat