Home / SLIDER / తెలంగాణలో కొత్తగా 2,278కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 2,278కరోనా కేసులు

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 2,278 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి…

గడిచిన 24 గంట్లలో కరోనాతో 10 మంది మృతి చెందారు. తెలంగాణ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,54,880కు చేరింది. అలాగే కరోనా బారిన పడి మొత్తం 950 మంది మరణించారు.

ప్రస్తుతం తెలంగాణలో 32,005 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకుని 1,21,925 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా జీహెచ్ఎంసీలో 331, రంగారెడ్డిలో 187, మేడ్చల్‌లో 150 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.