‘‘నన్ను నేను నమ్మాలని నిర్ణయించుకున్నాను. ఒక్క సిక్స్ కొట్టాలనుకున్నాను. తర్వాత అదే కొనసాగించాలని ఫిక్స్ అయ్యాను. అయితే ఒకే ఓవర్లో ఐదు సిక్స్‌లు కొట్టడం నిజంగానే అద్భుతం. నిజానికి లెగ్ స్పిన్నర్ బౌలింగ్‌లో సిక్సర్లు బాదేందుకు కోచ్ నన్ను పంపించారు.
దురదృష్టవశాత్తు ఆ పనిచేయలేకపోయాను. అయితే అంతిమంగా ఇతర బౌలర్లపై విజయం సాధించాను’’ అంటూ రాజస్తాన్ రాయల్స్‌కు అద్భుతమైన విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించిన రాహుల్ తెవాతియా హర్షం వ్యక్తం చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఎదుర్కొన్న తొలి 20 బంతులు తన కెరీర్లో అత్యంత చెత్త బంతులు అని క్రీజులో నిలదొక్కుకునేందుకు శ్రమించిన తీరును ప్రస్తావించాడు.
మరోవైపు ఐపీఎల్-2020 సీజన్లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. స్టీవ్ స్మిత్(50; 27 బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్స్‌లు), సంజూ శాంసన్(85; 42 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు), తెవాతియా( 53; 31 బంతుల్లో 7 సిక్స్‌లు)లు విక్టరీలో కీలక పాత్ర పోషించారు.
అయితే చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ స్వరూపాన్నే మార్చివేసిన తెవాతియా గేమ్ ఛేంజర్‌గా నిలిచాడు. అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఈ లెఫ్ట్ హ్యాండర్, 18వ ఓవర్లో ఐదు సిక్స్‌లు కొట్టి కాట్రెల్‌కు చుక్కలు చూపాడు.