Home / MOVIES / గ్రీన్‌ చాలెంజ్‌లో శేఖర్‌ కమ్ముల

గ్రీన్‌ చాలెంజ్‌లో శేఖర్‌ కమ్ముల

టీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్‌  ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ని ప్రముఖ దర్శకులు శేఖర్‌ కమ్ముల, కొరియోగ్రాఫర్‌  బాబాభాస్కర్‌లు స్వీకరించారు.కార్యక్రమంలో భాగంగా గురువారం మొయినాబాద్‌ మండలం కనకమామిడి గ్రామంలో జరుగుతున్న  ‘లవ్‌ స్టోరీ’ సినిమా షూటింగ్‌లో రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు. అనంతరం శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ ఎంపీ సంతోష్‌ కుమార్‌ పర్యావరణ పరిరక్షణకు ఎంతో కృషి చేస్తున్నారన్నారు.

మొక్కలు నాటి వాటిని కాపాడే బాధ్యత తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు.  వృక్షసంపద తరిగిపోవడం తట్టుకోలేని పర్యావరణ ప్రేమికులు ఎంపీ సంతోష్‌ కుమార్‌కి ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారంటే ఆయన పర్యావరణ ప్రేమికుడిగా ఎంతగా గుర్తింపు పొందారో అర్ధం అవుతుందన్నారు.

సీఎం కేసీఆర్‌కి బాసటగా గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ చేపట్టిన ఎంపీ సంతోష్‌ కుమార్‌ని ప్రత్యేకంగా అభినందించారు. మరోవైపు ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌ బాబా భాస్కర్‌ చెన్నైలోని తన    నివాసంలో మొక్కలు నాటారు. మిత్రుడు శేఖర్‌ మాస్టర్‌ ఇచ్చిన ఛాలెంజ్‌ మేరకు  మొక్కలు నాటినట్లు చెప్పారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ గొప్ప కార్యక్రమని కొనియాడారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat