Home / MOVIES / పెళ్ళి పై అందాల రాక్షసి రాశీఖన్నా సంచలన వ్యాఖ్యలు

పెళ్ళి పై అందాల రాక్షసి రాశీఖన్నా సంచలన వ్యాఖ్యలు

అందాల రాక్షసి రాశీఖన్నా యాంబిషియస్‌ పర్సన్‌.. ఆమెకు ఆత్మ విశ్వాసమూ ఎక్కువే.. అందానికి ఆమె ఇచ్చే నిర్వచనం కూడా అదే! వ్యక్తిగత జీవితంలో ప్రశాంతంగా కనిపించే ఆమె వృత్తి విషయంలో చాలా కఠినం… లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితమైన రాశీఖన్నా ఆ సమయంలో ఏం చేశారు? కరోనా ఆమెకు ఏం నేర్పించింది? ఈ ఆసక్తికర విషయాలను ఆమె  ABN ‘నవ్య’తో పంచుకున్నారు.

రాశీఖన్నా ఎవరు?

రాశీఖన్నా గురించి చెప్పడం చాలా కష్టం. తనొక యాంబిషియస్‌ అమ్మాయి. కానీ ప్రశాంతంగా ఉంటుంది. స్వంత విషయాల్లో కఠినంగా ఉంటుంది. తన తప్పులు తానే
తెలుసుకుంటుంది. ఇతరులు వాటిని ఎత్తి చూపేందుకు అవకాశం ఇవ్వదు. నటనంటే ప్రాణం. కష్టపడి పనిచేస్తుంది. ప్రశంసైనా, విమర్శ అయినా సానుకూలంగానే తీసుకుంటుంది.

అంటే రాశీఖన్నా ఈజీ గోయింగ్‌ పర్సన్‌..

వ్యక్తిగత జీవితంలో కరెక్టే. సంఘర్షణ కోరుకోను. కానీ వృత్తి విషయంలో మాత్రం ఎక్కడ రాజీపడను. అందరితోను పోటీ పడతా!

మీరు పరిశ్రమకు వచ్చి ఏడేళ్లు అవుతోంది.. ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి?

సినిమా పరిశ్రమే కాదు. ఎక్కడైనా సవాళ్లు తప్పవు. గత ఏడేళ్లలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. వాటిని చూసి కుంగిపోలేదు. వాటిని ఎలా అధిగమించాలో నేర్చుకున్నా. నాకు చెడు
అనుభవాలు ఏమి ఎదురుకాలేదు. కానీ అలాంటి అనుభవాలు కొందరికి ఎదురయ్యాయి. వారు చెప్పినవి విన్నప్పుడు బాధ అనిపించింది.

మీరు అనేక మంది మహిళలను చూసి ఉంటారు.. ప్రస్తుత సమాజంలో మహిళల పరిస్థితి ఏమిటి?

చాలా దారుణంగా ఉంది. ఒక వైపు మహిళలు ఎంతో సాధిస్తోందనే వార్తలు వింటూ ఉంటాం. మరో వైపు ఆమెపై హత్యాచారాలు జరుగుతూ ఉంటాయి. తాజాగా హాథ్రాస్‌ ఘటననే
తీసుకోండి. ఈ ఏడాది ఇలాంటి వార్తలు ఎన్నో వింటున్నాం. విన్నప్పుడల్లా ఏదో చేయాలనిపిస్తుంది. కానీ విని బాధపడటం తప్ప ఏం చేయలేకపోతున్నా. మార్పు ఏ ఒక్కరి వల్లో
సాధ్యం కాదు. అందరూ కలిసినప్పుడే సాధ్యమవుతుంది.

కొవిడ్‌-19 వల్ల అందరూ నష్టపోయారు కదా.. మీ అనుభవాలేమిటి?

కరోనాతో ప్రపంచం తారుమారు అయిపోయింది. ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎవరూ ఊహించి ఉండరు. భవిష్యత్తులో రాసే చరిత్రలో ఇదొక అధ్యాయం. బయట ఎంతోమంది జనం
పనులు లేక.. కడుపు నింపుకోవడానికి తిండి లేక ఇబ్బంది పడ్డారు. వలస కార్మికుల ఇక్కట్లు చూస్తే చాలా బాధ కలిగింది. నాకు కడుపునిండా తిండి పెడుతున్న దేవుడికి
కృతజ్ఞతలు చెప్పుకున్నా. కొవిడ్‌ వల్ల అందరిలోను మార్పు వచ్చింది. నాలోను వచ్చింది. ‘ఈరోజు ఓకే.. రేపటి పరిస్థితి ఏంటి? అన్న ఆలోచన మొదలైంది!

లాక్‌డౌన్‌లో మీకున్న సపోర్ట్‌ సిస్టమ్‌ ఏమిటి?

నా తల్లిదండ్రులే! ఎలాంటి సందర్భంలో అయినా వారే నాకు బెస్ట్‌ సపోర్ట్‌ సిస్టమ్‌. ఇంట్లో ఉంటే స్వేచ్ఛ, స్వతంత్రం, ప్రశాంతత ఉన్నట్లు అనిపిస్తుంది. వాస్తవానికి నాకు ఆధ్యాత్మిక
చింతన ఎక్కువ. మనసు బాగోకపోతే మెడిటేషన్‌ చేస్తా. ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతా!

లాక్‌డౌన్‌లో కాలం ఎలా గడిచింది?

మొదట్లో కొద్దిరోజులే కదా అనుకున్నా. కరోనా ఉద్ధృతి పెరగడంతో ఎప్పుడూ పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. మొదటి నెల ఓకే! రెండో నెల ఫ్రస్ట్రేషన్‌ మొదలయింది.
చిరాకు, కోపం వచ్చేవి. దీంతో పాత హాబీలను ప్రాక్టీసు చేయటం మొదలుపెట్టా. గిటార్‌ నేర్చుకున్నా. తమిళం నేర్చుకోవటం మొదలుపెట్టా! బెటర్‌ లుక్‌ కోసం జిమ్‌లో ఎక్కువసేపు
వ్యాయామం చేశా. నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త సిరీస్‌లు చూశా. ఇలా ఆ నెల కూడా గడిచిపోయింది. ఇక మూడో నెలలోకి ప్రవేశించిన తర్వాత నా ఆలోచనల్లో మార్పు వచ్చింది. సమయాన్ని
వృథా చేయకుండా కథలు వినటం మొదలుపెట్టా. బంధువులు, మిత్రులతో జూమ్‌ కాల్స్‌తో కలవటం మొదలుపెట్టా!

లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాత ఎలా ఉంది?

చాలా రిలీఫ్‌ అనిపించింది. ఆరు నెలల తర్వాత సెట్‌లోకి అడుగుపెడితే- సొంత ఇంటికి వెళ్లినట్లనిపించింది. అంతే కాకుండా ఇప్పుడు నేను చేస్తున్నవన్నీ వైవిధ్యభరితమైన పాత్రలే!
ప్రస్తుతం తమిళంలో ‘మేధావి’, ‘ఆరన్మణై 3’ చేస్తున్నా. తెలుగులో మూడు సినిమాలు కథల స్టేజ్‌లు ఉన్నాయి. ఒక వెబ్‌ సిరీస్‌ చేస్తున్నా. ఒక్క మాటలో చెప్పాలంటే మళ్లీ
బిజీ అయిపోయా!

సీక్రెట్‌ డిజైర్‌?

రహస్యంగా దాచిపెట్టే కోరికలేమీ లేవు. వృత్తి విషయంలో చాలానే ఉన్నాయి. ఆ కోరికలన్నీ తీరిన తర్వాతే బయటకు చెబుతా. ఒకటి మాత్రం చెబుతా.. నటిగా మంచి పాత్రలు
పోషించాలి.. ఆడియన్స్‌ని అలరించాలి. ఇక అల్టిమేట్‌ గోల్‌ అంటే… అద్భుతమైన కథలో బలమైన పాత్ర చేయాలి. అది నా బెస్ట్‌ పిక్చర్‌ కావాలి. అప్పటి వరకూ ఈ వృత్తిని
వదిలిపెట్టను.

కొత్త కవితలేమన్నా రాశారా?

లాక్‌డౌన్‌లో కథలు వినే బిజీలో కవితలు రాయలేదు. నాకు ఎంతో ఇష్టమైన థ్రిల్లర్‌ జానర్‌ కథ ఒకటి రాయాలనుకుంటున్నా. స్టోరీ టెల్లింగ్‌ నాకు ఇష్టం. భవిష్యత్తులో అటువైపు కూడా
అడుగేస్తా.

బిగ్గెస్ట్‌ రిగ్రెట్‌..

ఏది లేదు. నేను తలరాతను నమ్ముతా! కష్టపడి పనిచేయటం నా చేతిలో ఉంటుంది. తలరాత నా చేతిలో ఉండదు.

సీక్రెట్‌ డిజైర్‌

వ్యక్తిగతంగా ఏమి లేవు. నటన విషయంలో చాలా ఉన్నాయి. ఒక అద్భుతమైన కథలో బలమైన పాత్ర చేయాలి. అదే నా బెస్ట్‌ పిక్చర్‌ అవ్వాలి.

బిగెస్ట్‌ ఫియర్‌

నాకు భయాలేమి లేవు. దేని కోసమైనా పోరాడతాను.

బ్యూటీ అంటే..

ఆత్మవిశ్వాసమే అందం. ఇది మన కట్టు, బొట్టు, నడకల్లో కనిపిస్తూ ఉంటుంది.

వర్క్‌ లైఫ్‌ బ్యాలెన్స్‌ ఎలా?

వర్క్‌, లైఫ్‌ రెండు వేర్వేరు కాదు. అందువల్ల ఆ ప్రశ్నే తలెత్తదు.

బెస్ట్‌ ఫ్రెండ్స్‌

ఇండస్ట్రీలో ఎవరూ లేరు. అందరితోను బాగానే మాట్లాడతా. చిన్ననాటి స్నేహితులు మాత్రం వాణి, సావంత్‌.

పెళ్లెప్పుడు?

సమయం వచ్చినప్పుడు. మనసుకి నచ్చిన వ్యక్తి తారసపడితే ఇంట్లో చెప్పి లవ్‌ మ్యారేజ్‌ చేసుకుంటా.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat