Home / NATIONAL / బీజేపీ మంత్రి మృతి

బీజేపీ మంత్రి మృతి

ప్రస్తుతం దేశంలో కరోనా మమ్మారి విజృంభిస్తున్న సంగతి విదితమే. ప్రతి రోజు సుమారు డెబ్బై వేలకు పైగానే కరోనా కేసులు నమోదవుతున్న వార్తలను మనం చూస్తూనే ఉన్నాము.

తాజాగా బీహార్ కి చెందిన మంత్రి,బీజేపీనేత వినోద్ కుమార్ మృతి చెందారు. అయితే గత జూన్ నెలలో కరోనా బారిన పడిన ఆయన కోలుకున్నారు. నెలన్నర తర్వాత అనారోగ్యం బారిన పడిన ఆయన దేశ రాజధాని ఢిల్లీలోని మెదంత ఆసుపత్రిలో చేరారు.

కానీ మంత్రి వినోద్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో ప్రాణాలు వదిలినట్లు వైద్యులు తెలిపారు.త్వరలోనే బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో ప్రాన్ పూర్ నుండి వినోద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.