Home / ANDHRAPRADESH / ఏపీలో తగ్గిన కరోనా కేసులు

ఏపీలో తగ్గిన కరోనా కేసులు

ఏపీలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు  కొత్తగా 2,997 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి మొత్తం ఏపీలో 80,7,023కి కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య చేరింది.

24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో 21 మంది మృతి చెందారు. ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 6,587 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,860 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 7,69,576 మంది రికవరీ అయ్యారు.

కొత్తగా చిత్తూరులో 5, కడపలో ముగ్గురు మృతి చెందారు. అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. నెల్లూరు, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందారు.

ఏపీలో ఇప్పటి వరకు 75,70,352 కరోనా టెస్టుల చేశారు. ఈ రోజు అత్యధికంగా పశ్చిమగోదారి జిల్లాలో 492, చిత్తూరు 466, ప్రకాశం 340, కృష్ణా 358 కేసులు నమోదయ్యాయి.