తెలంగాణలో గత 24 గంటల్లో 45,526 కరోనా టెస్టులు చేయగా 1,637 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,44,143కు చేరింది.
ఇందులో 18,100 మంది చికిత్స తీసుకుంటుండగా, 2,24,686 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో కరోనాతో ఆరుగురు చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 1,357కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 44,39,856 కరోనా టెస్టులు చేశారు