Home / CRIME / కాంగ్రెస్ ఎమ్మెల్సీ కుమారుడు అరెస్ట్

కాంగ్రెస్ ఎమ్మెల్సీ కుమారుడు అరెస్ట్

మ‌ద్యం మ‌త్తులో పోలీసుల‌తో దురుసుగా మాట్లాడిన ఓ యువ‌కుడిని బెంగ‌ళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఆ యువ‌కుడిని కాంగ్రెస్ ఎమ్మెల్సీ న‌సీర్ అహ్మ‌ద్ కుమారుడు ఫ‌యాజ్‌గా పోలీసులు గుర్తించారు.

ఫ‌యాజ్‌తో పాటు మ‌రో ఇద్ద‌రిని అదుపులోకి తీసుకున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. పీక‌ల దాకా మ‌ద్యం సేవించిన ఫ‌యాజ్ ఆదివారం రాత్రి పోలీసుల‌తో వాగ్వాదానికి దిగాడు. అంత‌టితో ఆగ‌కుండా హెడ్ కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.