Home / HYDERBAAD / ఐటీలో తెలంగాణ మేటి.. ఎందుకంటే..?

ఐటీలో తెలంగాణ మేటి.. ఎందుకంటే..?

ప్రపంచమంతా రాష్ట్రం వైపు చూడాలి.. ఉద్యోగాలు, ఉపాధి పెరగాలి.. అదే సమయంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి.. ఏ ఒక్కచోటో ప్రగతి కేంద్రీకృతమై ఉంటే ప్రయోజనం ఉండదు. అందుకే హైదరాబాద్‌ పశ్చిమాన కేంద్రీకృతమైన ఐటీని హైదరాబాద్‌ అంతటా విస్తరింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఘనమైన ముందడుగు వేసింది. ఐటీ వికేంద్రీకరణకు ఐటీ అండ్‌ సీ, హైదరాబాద్‌ గ్రిడ్‌ (గ్రోత్‌ ఇన్‌ డిస్పెర్షన్‌) పాలసీ మార్గదర్శకాలను విడుదల చేసింది. నగరానికి పశ్చిమ దిశలోనే కాకుండా మిగతా మూడు వైపులా ఐటీ పార్కులు, టవర్లను నెలకొల్పేందుకు కీలక గైడ్‌లైన్స్‌ ఇచ్చింది. అంతేకాదు.. ఔటర్‌ రింగురోడ్డుకు లోపల ఉన్న 11 పారిశ్రామిక పార్కులను ఐటీ పార్కులుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. నగరానికి తూర్పు, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లోనూ ఐటీ పరిశ్రమలు, కంపెనీలు విస్తరించేందుకు వీలుగా ప్రోత్సాహకాలను కూడా పొందుపర్చింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని ప్రాంతానికంతటికీ గ్రిడ్‌ పాలసీ ఉత్తర్వులు వర్తిస్తాయి. ఇందులో పశ్చిమ క్లస్టర్‌ కూడా ఉంటుంది. పశ్చిమ క్లస్టర్‌లో గచ్చిబౌలి, కోకాపేట్‌, మాదాపూర్‌, రాయ్‌దుర్గ్‌, పుప్పాలగూడ, నార్సింగి, నానక్‌రాంగూడా, కొండాపూర్‌, ఖానామెట్‌, గుట్టల బేగంపేట, మణికొండ, నల్లగండ్ల, గోపన్‌పల్లి, గౌలిదొడ్డి తదితర గ్రామాలు కూడా వస్తాయి.

గ్రిడ్‌ పాలసీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే..

హైదరాబాద్‌కు పశ్చిమాన మాదాపూర్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ తదితర ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల్లో పనిచేసే 30 శాతం మంది తూర్పున నివసిస్తూ, అక్కడి నుంచి ఇటు ప్రయాణిస్తున్నారు. దీంతో నగరమంతా రద్దీగా మారింది. ప్రయాణ సమయం ఎక్కువవుతున్నది. అంతేకాకుండా, మరెన్నో కంపెనీలు నగరానికి పోటెత్తుతున్నాయి. దీన్ని గమనించిన సర్కారు.. ఐటీ పరిశ్రమను మిగతా ప్రాంతాలకూ విస్తరించాలని నిర్ణయించింది. ఇందుకోసం 11 పారిశ్రామిక పార్కులను ఐటీ పార్కులుగా మార్చనున్నది.

యూనిట్‌ ఇన్సెంటివ్స్‌

2016 ఐసీటీ పాలసీలో పొందుపర్చిన ఇన్సెంటివ్స్‌తోపాటు అదనంగా ప్రోత్సాహకాలను ఈ గ్రిడ్‌ కింద ఐటీ కంపెనీలు పొందవచ్చు. గ్రిడ్‌ మార్గదర్శకాలకు అర్హత పొందిన యూనిట్ల విద్యుత్తు క్యాటగిరీ వాణిజ్యం నుంచి పారిశ్రామిక క్యాటగిరీకి మారుతుంది. ఇలాంటి యూనిట్లకు అదనంగా యూనిట్‌కు రూ.2 చొప్పున సబ్సిడీ ఇస్తారు. ఇది ఐదేండ్ల పాటు అమలు చేస్తారు. ఇలా ఇచ్చే ప్రోత్సాహకం సంవత్సరానికి రూ.5 లక్షలు దాటరాదు. ప్రతి సంవత్సరం చివరలో రీయింబర్స్‌మెంట్‌ పద్ధతిలో ఈ ప్రోత్సాహకాన్ని అందిస్తారు. గ్రిడ్‌ ప్రోత్సాహకాలు పొందడానికి అర్హులైన ప్రతి యూనిట్‌కు లీజ్‌ రెంటర్‌ సబ్సిడీ 30 శాతం ఇస్తారు. ఇది ఐదేండ్లపాటు ఇస్తారు. ఈ మొత్తం ఏటా రూ.10 లక్షలకు దాటకూడదు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఐసీటీ పాలజీ-2016 ప్రకారం ఎస్‌ఎంఈ యూనిట్‌కు 25 శాతం లీజ్‌ రెంటల్‌ సబ్సిడీని అందిస్తున్నారు. ఇది మూడేండ్ల పాటు సంవత్సరానికి రూ.5లక్షలుగా ఉంది. గ్రిడ్‌ మార్గదర్శకాల ప్రకారం.. ఇది మరో రెండేండ్లు పెంచడంతోపాటు అదనంగా లీజ్‌ రెంటల్‌ను 5 శాతం పెంచుతారు.

ప్రోత్సాహకాలివీ:

  • యూనిట్‌ ఇన్సెంటివ్స్‌
  • యాంకర్‌ ఇన్సెంటివ్స్‌
  • డెవలపర్‌ ఇన్సెంటివ్స్‌
  • ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్‌ డెవలప్‌మెంట్స్‌
  • ఇన్‌స్టిట్యూషనల్‌ మీజర్స్‌
  • బ్రాండింగ్‌ అండ్‌ ప్రమోషనల్‌ యాక్టివిటీస్‌

యాంకర్‌ ఇన్సెంటివ్స్‌

గ్రిడ్‌ మార్గదర్శకాల ప్రకారం 500 కన్నా ఎక్కువ మందికి ఉపాధి కల్పించే యూనిట్లను యాంకర్‌ యూనిట్‌గా పరిగణిస్తారు. ఇలా ప్రస్తుతం ఉన్న కంపెనీలకు కానీ, కొత్త కంపెనీలకు రాష్ట్రమంత్రివర్గ అనుమతితో  ప్రోత్సాహక ప్యాకేజీలను యాంకర్‌ యూనిట్లకు వర్తింపజేస్తారు. అందుకు కంపెనీలు కనీసం మూడేండ్ల పాటు 500 మందికి ఉపాధి కల్పించినట్టు ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది.

మౌలిక సదుపాయాల అభివృద్ధి

గ్రిడ్‌ కారిడార్‌ అభివృద్ధి కోసం జీహెచ్‌ఎంసీ, టీఎస్‌ఐఐసీ, హెచ్‌ఎండీఏ, హెచ్‌డీసీఎల్‌, హెచ్‌ఎంఆర్‌ పనిచేస్తాయి. ఈస్టర్న్‌ కారిడార్‌లో రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ చైర్మన్‌గా రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఆర్‌కేఎస్‌సీ), సొసైటీ ఫర్‌ సైబర్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్‌సీఎస్‌సీ) సంస్థలు సమన్వయంతో కొనసాగుతాయి. ఐటీ కంపెనీల్లో పనిచేసే వారికి సంపూర్ణ రక్షణ ఏర్పాట్లు ఉంటాయి. ప్రత్యేకంగా పోలీస్‌ స్టేషన్లు (మహిళా పోలీస్‌ స్టేషన్‌తోపాటు), షీ టీమ్స్‌, సీసీ కెమెరాలు, పారిశ్రామిక వాడలన్నీ నిరంతర నిఘాలో ఉంటాయి.

వృద్ధి ప్రోత్సాహకాలు

స్థానిక పారిశ్రామికసంస్థ లేదా టీఎస్‌ఐఐసీ పరిధిలో ఉన్న భూములను ఐటీ/ఐటీఈఎస్‌కు వినియోగించేందుకు వీలుగా బదలాయింపు చేయాలి. సదరు నిర్మిత ప్రదేశంలో కనీసం 50శాతం ప్రాంతాన్ని ఐటీ కోసం వినియోగించాలి. మిగిలిన 50శాతం నిర్మిత ప్రదేశాన్ని ఐటీయేతరాలకు (కమర్షియల్‌గానైనా సరే) వినియోగించుకోవచ్చు. డెవలపర్‌ ముందే నిర్దేశిత నిర్మిత ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలి. మొత్తం ఏరియాలో 50శాతం ఐటీ/ఐటీఈఎస్‌కు ఏ ప్రాంతం అనేది ముందే పేర్కొనాలి. మొత్తం భూమి విలువలో 30శాతం బేసిక్‌ రిజిస్ట్రేషన్‌ విలువను భూ బదలాయింపు ఫీజుగా పరిగణిస్తారు. టీఎస్‌ఐఐసీ/ఐఎఎల్‌ఎకు సంబంధించిన భూములకు మినహా మిగితా భూబదలాయింపుల విషయంలో నాలా కన్వర్షన్‌ ఫీజు చెలించే వెసులుబాటు ఉంటుంది.

బ్రాండింగ్‌ అండ్‌ ప్రమోషన్‌

ఐటీ యూనిట్ల విస్తరణ కోసం గ్రిడ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా పరిశ్రమ స్థాపనకు ముందుకొచ్చే ఔత్సాహికులకు అవసరమైన ప్రోత్సాహకాలు లభిస్తాయి. నైపుణ్యం కలిగిన మానవ వనరుల లభ్యత, పుష్కలమైన రవాణా సౌకర్యాలు ఉండటం అనేది అదనపు ఆకర్షణ. గ్రిడ్‌ కారిడార్ల ఉన్నతీకరణ కోసం బడ్జెట్‌ కేటాయింపులు చేస్తారు. అంతేకాకుండా యాంకర్‌ యూనిట్లను స్థాపించేందుకు ఐటీ విభాగం నిరంతరం క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. ప్రస్తుత పారిశ్రామిక ప్రాంతంలో ఐటీ కార్యకలాపాల కోసం భూ బదలాయింపు చేసుకున్న డెవలపర్లకు మొత్తం నిర్మాణ ప్రదేశంలో 60:40 పద్ధతే వర్తిస్తుంది.

ఐటీ పార్కులుగా మారనున్న పారిశ్రామిక పార్కులివే..

1. కూకట్‌పల్లి ఇండస్ట్రియల్‌ పార్కు

2. గాంధీనగర్‌ ఇండస్ట్రియల్‌ పార్కు

3. బాలానగర్‌ ఇండస్ట్రియల్‌ పార్కు

4. ఉప్పల్‌ ఇండస్ట్రియల్‌ ఏరియా

5. నాచారం ఇండస్ట్రియల్‌ ఏరియా

6. మల్లాపూర్‌ ఇండస్ట్రియల్‌ పార్కు

7. మౌలాలి ఇండస్ట్రియల్‌ పార్కు

8. పటాన్‌చెరు ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ ఏరియా (పాక్షికంగా)

9. రామచంద్రాపురం ఏఐఈ

10. సనత్‌నగర్‌ ఇండస్ట్రియల్‌ పార్కు

11. కాటేదాన్‌ ఇండస్ట్రియల్‌ ఏరియా

వీటికి అదనంగా ఉత్తరాన ఉన్న కొంపల్లిలో ఒక ఐటీ టవర్‌, వాయవ్యం దిశగా ఉన్న కొల్లూరు/ఉస్మాన్‌నగర్‌ ప్రాంతంలో ఐటీ పార్కునుకూడా నెలకొల్పుతారు.ప్రస్తుతం ఉన్న, కొత్తగా ఏర్పాటు చేయనున్న ఐటీ క్లస్టర్లు..

పశ్చిమం: మాదాపూర్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి, కోకాపేట సమీప ప్రాంతాలు

నైరుతి: రాజేంద్రనగర్‌, బుద్వేల్‌, కిస్మత్‌పూర్‌ సమీప ప్రాంతాలు

ఉత్తరం: కొంపల్లి, బహదూర్‌పల్లి, పటాన్‌చెరు, బౌరాంపేట సమీప ప్రాంతాలు

వాయవ్యం: కొల్లూరు, ఉస్మాన్‌నగర్‌, తెల్లాపూర్‌ సమీప ప్రాంతాలు

దక్షిణం: ఆదిభట్ల, శంషాబాద్‌ (జీఎంఆర్‌ ఏరోసిటీతో కలిపి) సమీప ప్రాంతాలు

తూర్పు: ఉప్పల్‌, పోచారం సమీప ప్రాంతాలు

సీబీడీ: బేగంపేట్‌, సనత్‌నగర్‌, బంజారాహిల్స్‌ సమీప ప్రాంతాలు

ఐటీలో మనమే మేటి.. ఎందుకంటే..

  • హైదరాబాద్‌లో 1500లకు పైగా ఐటీ కంపెనీలు ఉన్నాయి.
  • 2019-20లో తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.1,28,807 కోట్లు.
  •  ఏడాది రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు 17.93 శాతం పెరిగాయి. జాతీయ సగటు పెరుగుదల 8.09 శాతమే.
  • ఇక్కడి కంపెనీల్లో 5,82,126 మంది ఐటీ ప్రొఫెషనల్స్‌ ఉన్నారు.
  • గత ఆరేండ్లలో ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ వృద్ధి రేటు 14.46 శాతం.
  • రాష్ట్రంలో ఉపాధి వృద్ధి 7.2%. జాతీయ సగటు 4.93 శాతమే.
  • గత ఆరేండ్లలో తెలంగాణలో ఉపాధి వృద్ధి రేటు 10.29 శాతం.
  • ఐటీ ఎగుమతులను 2025 నాటికి లక్ష్యం రూ.1,87,000 కోట్లు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat