Home / MOVIES / రామ్ గోపాల్ వర్మ బిగ్ బాస్ ఎంట్రీ

రామ్ గోపాల్ వర్మ బిగ్ బాస్ ఎంట్రీ

రామ్ గోపాల్ వర్మ ఏంటి.. బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వడం ఏంటి మరీ విడ్డూరం కాకపోతేనూ అనుకుంటున్నారు కదా..? మరి అలాగు ఉంటది.. ఎందుకంటే వర్మ బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వడం అంటే కే విశ్వనాథ్ వచ్చి రక్తచరిత్ర తీసినట్లే ఉంటుంది. అది ఎలా జరగదో ఇది కూడా అలాగే జరగదు. పైగా వర్మకు అసలు బిగ్ బాస్ అంటేనే తెలియదు.. దాని కాన్సెప్ట్ కూడా ఐడియా లేదు. ఈ మాటలు చెప్పింది కూడా ఈయనే.

డిసెంబర్ 11న ఈయన చేసిన కరోనా వైరస్ సినిమా విడుదలైంది. దీని ప్రమోషన్స్ లో భాగంగానే అందరికీ ఇంటర్వ్యూలు ఇచ్చాడు వర్మ. అందులోనే ఇవన్నీ మాట్లాడాడు ఈ దర్శకుడు. వినేవాళ్లుంటే రామాయణం రాసింది కూడా నేనే అని చెప్పేరకం వర్మ.. చెప్పడమే కాదు నమ్మిస్తాడు కూడా. అంత మాటల మరాఠీ ఈయన.

వర్మను ఏ మాత్రం తక్కువగా అంచనా వేసినా కూడా ఎదుటి వాళ్లను పిచ్చోళ్లు అయిపోవడం ఖాయం. అంతగా మాటలతో మాయ చేస్తుంటాడు ఈయన. బిగ్ బాస్ అంటేనే తనకు తెలియదని.. అందులో ఎంతమంది ఉంటారో కూడా తనకు క్లారిటీ లేదని ఈ మధ్యే చెప్పాడు వర్మ. అలాంటి వర్మ ఇప్పుడు బిగ్ బాస్ లోకి వస్తానంటున్నాడు. వెళ్ళడానికి తనకేం అభ్యంతరాలు లేవని చెప్పుకొచ్చాడు.

అంతేకాదు ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్లలో తన సపోర్ట్ అరియానాకు ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు వర్మ. అయితే తాను బిగ్ బాస్ లోకి వెళ్లాలంటే మాత్రం రూల్స్ మొత్తం మార్చేయాలని తన మార్క్ కండీషన్స్ పెడుతున్నాడు. అంతేకాదు.. తను ఒక్కడినే మగాన్ని ఉండాలని.. మిగిలిన 15 మంది అమ్మాయిలు ఉంటే తను ఎన్ని రోజులైనా బిగ్ బాస్ హౌజ్ లో ఉండటానికి ప్రాబ్లమ్ లేదని చెప్పాడు ఈయన. అది విన్న తర్వాత ఒక్కసారిగా అందరి బుర్రలు గిర్రున తిరుగుతున్నాయి. అంతేమరి.. వర్మతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat