సోహైల్ బిగ్ బాస్ షోకు రాకముందు సినిమాలు, సీరియల్స్‌లో నటించాడు. కాని అతనికి కొంచెం అంటే కొంచెం గుర్తింపు కూడా రాలేదు. బిగ్ బాస్ షోకు వచ్చిన తర్వాత సోహైల్ పేరు మారుమ్రోగిపోతుంది.
ఏ విషయాన్నైన సూటిగా మాట్లాడడం, స్నేహానికి విలువ ఇవ్వడం, తనని అభిమానించే వారి కోసం ఎంత దూరం అయిన వెళ్లేందుకు సిద్దపడడం సోహైల్‌ని జనాలకి చాలా దగ్గర చేసింది. సింగరేణి ముద్దు బిడ్డ అంటూ గర్వంగా చెప్పుకొనే సోహైల్ ఒకానొక సందర్భంలో ( రోబో టాస్క్ గొడవప్పుడు) కథ వేరుంటంది అని అవేశంతో అన్నాడు. ఇప్పుడు ఈ డైలాగ్ తెలుగు రాష్ట్రాలలో ఫుల్ ఫేమస్ అయింది.
బిగ్ బాస్ సీజన్ 4కు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి.. సోహైల్‌తో ముచ్చటిస్తున్న సమయంలో ఆయన మేనరిజాన్ని అనుకరిస్తూ జోష్‌తో మాట్లాడారు. సింగరేణి ముద్దు బిడ్డ.. కథ వేరుంటది అని చిరు అనడంతో సోహైల్ ఆనందం అవధులు దాటింది.
నీ పర్మీషన్ ఇస్తే ఈ డైలాగ్‌ని నా తదుపరి సినిమాలలో పెట్టుకుంటానని చిరు అనడం కొసమెరుపు. కాగా, సోహైల్ సినిమాలో చిరు అతిథి పాత్ర పోషిస్తానని మాట ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక మటన్‌ని బాగా ఇష్టపడే సోహైల్ కోసం చిరు తన ఇంట్లో మటన్ బిర్యాని స్వయంగా చేయించి పంపించారు.