తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. కరోనా నిర్ధారణ కావడంతో తాను స్వీయ గృహనిర్భంధంలోకి వెళ్లాను.
తనను కలిసి వ్యక్తులందరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. ప్రస్తుతం తన ఆరోగ్యపరిస్థితి బాగుందని..తగినంత విశ్రాంతి తీసుకొని తిరిగి షూటింగ్స్‌కు హాజరవుతానని రకుల్‌ప్రీత్‌సింగ్ పేర్కొంది.
ప్రస్తుతం రకుల్‌ప్రీత్‌సింగ్ తెలుగులో క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రంతో పాటు నితిన్ సరసన ‘చెక్’ సినిమాలో నటిస్తోంది. బాలీవుడ్లో మూడు సినిమాలతో బిజీగా ఉంది.