Home / SLIDER / పెండ్లి పెద్దగా మారిన – రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్

పెండ్లి పెద్దగా మారిన – రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్

తన్నీరు.. పేరులోనే ఉంది. ఆ కన్నీరును తుడిచే గుణం.! అలాంటి రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ అన్నీ తానై అండగా నిలిచి భాగ్య బరువు దించారు.* చదివించారు. పెద్ద చేశారు. పెళ్లి చేశారు. అనాథయిన అభాగ్యురాలికి మంత్రి సూచన మేరకు జిల్లా కలెక్టర్ ఆపన్న హస్తం అందించారు. కష్ట కాలంలో ఉన్న బాలికకు విద్య బుద్ధులు అందించి బతుకు దెరువుకై ఉపాధినిచ్చారు. పెండ్లీడు వచ్చిన భాగ్య అభీష్టం మేరకు గతంలో సౌదీలో డ్రైవర్ ఉద్యోగం చేసి తిరిగి స్వదేశానికి చేరుకున్న తర్వాత స్వయం కృషితో ఉపాధికై టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్న ఇబ్రహీంనగర్ కు చెందిన రాజుతో వివాహాన్ని జరిపించారు.

అనాథ బాలికకు అండగా.. చదువు నుంచి పెళ్లి దాకా అన్ని తామై మంత్రి హరీశ్, జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి రాంగోపాల్ రెడ్డి, ఇతర అధికారులంతా కలిసి తమ ఇంటి కార్యక్రమంలో పాల్గొన్నట్లుగా సంబరంగా పెండ్లి వేడుకను హట్టహాసంగా జరిపించి మానవత్వం చాటుకున్నారు.
చిన్నకోడూర్ మండలం కస్తూరిపల్లికి చెందిన భాగ్య తల్లిదండ్రులను కోల్పోయి ఎవ్వరూ పట్టించుకోక అభాగ్యురాలిగా మారింది. ఈ విషయం దిన పత్రికలలో చూసిన మంత్రి హరీశ్ రావు వెనువెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డితో మాట్లాడి.. భాగ్య చదువు, విద్య, ఉపాధి బాధ్యతలు తామే చూద్దామని సూచనలు చేశారు.

ఈ నేపథ్యంలో 2018లోనే మహిళా శిశు సంక్షేమ శాఖ అధీనంలో ఉన్న బాల సదనంలో ఆమెకు వసతి కల్పించారు. బాలల పరిరక్షణ విభాగంలో ఉద్యోగం కల్పించారు. మంత్రి, కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా అధికారిక యంత్రాంగం ఆమె బాగోగులు చూస్తున్నారు. ఈ మేరకు గురువారం చిన్నకోడూర్ మండలం ఇబ్రహీంనగర్ కు చెందిన యువకుడు రాజుతో సిద్ధిపేటలోని టీటీసీ భవనులో వివాహాం జరిగింది. ఈ పెళ్లికి పెద్దలుగా వ్యవహరించిన మంత్రి హరీశ్, కలెక్టర్ నూతన వధూవరులను చల్లని చూపుతో ఆశీర్వదించారు. బాల సదనంలోని చిన్నారులు, సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది సందడి చేసి ఈ వివాహా వేడుకలో పాల్గొన్నారు…

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat