దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 19,078 కేసులు, 224 మరణాలు 8,29,964 కరోనా టెస్టులు చేయగా 19,078 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,03,05,788కి చేరింది.
నిన్న 224 మంది ఈ మహమ్మారి కారణంగా మృతి చెందగా మొత్తం 1,49,218 మంది ప్రాణాలు విడిచారు గత 24 గంటల్లో 22,926 మంది కోలుకోగా మొత్తం రికవరీల సంఖ్య 99,06,387కు చేరింది. ప్రస్తుతం 2,50,183 యాక్టివ్ కేసులున్నాయి. ఇక దేశంలో ఇప్పటివరకు 17,39,41,658 టెస్టులు చేశారు