యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆన్ స్క్రీన్‌పైనే కాదు, ఆఫ్ స్క్రీన్‌లోను హీరోనే. ఆపద వచ్చినప్పుడు తానున్నాననే భరోసా ఇస్తుండే ప్రభాస్ కష్టకాలంలో పరిశ్రమకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా నిలుస్తుంటారు.
ఇక తనతో కలిసి పని చేస్తున్న వారికి వెరైటీ వంటకాలు తెచ్చి వడ్డించడం, పండుగలు, పబ్బాలకు ప్రత్యేక బహుమతులు గిఫ్ట్‌గా ఇచ్చి సర్ప్రైజ్ చేస్తుంటారు ప్రభాస్.
తాజాగా సంక్రాంతి పండుగ కానుకగా రాధేశ్యామ్ చిత్ర యూనిట్‌కు రిస్ట్ వాచెస్ గిఫ్ట్‌గా ఇచ్చారు ప్రభాస్. ఈ సర్ప్రైజ్ చూసి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. ప్రభాస్ మంచితనంపై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం కొద్ది రోజులలో థియేటర్స్‌లోకి రానుండగా, ప్రస్తుతం సలార్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో బిజీగా ఉన్నాడు.