Home / SLIDER / టీకాంగ్రెస్ నేతలు అరెస్ట్

టీకాంగ్రెస్ నేతలు అరెస్ట్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో రాజ్ భవన్ ఘెరావ్ పేరుతో కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనలను పోలీసులు నిలువరించారు.

నిరసనలను అదుపులోకి తెచ్చేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు వీహెచ్, పొన్నాలను అరెస్ట్ చేశారు. ఇప్పటికే లుంబినీ పార్క్ వద్దకు భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకోన్నారు.

దీంతో పోలీసులు బందోబస్తు పటిష్టం చేశారు. సంపత్ సహా మరికొంతమంది కాంగ్రెస్ నేతలను సైతం ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు.