బుల్లితెరపై ఒకపక్క యాంకరింగ్ తో మరో పక్క తన అందంతో తెలుగు ప్రేక్షకులను ఆలరిస్తున్న హాట్ బ్యూటీ అనసూయ మరో స్పేషల్ ఐటెం సాంగ్ లో నటించనున్నట్లు తెలుస్తుంది. తాజాగా ప్రత్యేక గీతంలో నర్తించేందుకు ఈ ముద్దుగుమ్మ ఓకే చెప్పిందట.
ప్రముఖ నిర్మాత బన్నీవాసు నిర్మిస్తున్న `చావు కబురు చల్లగా` సినిమాలో అనసూయ స్పెషల్ సాంగ్ చేస్తోందట.కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా డైరెక్టర్ కౌశిక్ రూపొందిస్తున్న `చావు కబురు చల్లగా` సినిమా చాలా వైవిధ్యంగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే విడుదలైన రెండు బైట్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ నేపథ్యంలో అనసూయ స్పెషల్ సాంగ్ సినిమాకు మరింత బూస్ట్ ఇస్తుందని చిత్రబృందం భావిస్తోందట