ఆంధ్రప్రదేశ్ సీఎం, అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు .రాష్ట్రంలో అన్నదాతల రక్షణకు ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయాలని సూచించారు.
జిల్లాకో PS ఏర్పాటు చేసి… వ్యవసాయ అంశాల్లో మోసాలు జరిగితే రైతుల అండగా నిలిచేలా చూడాలన్నారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను, న్యాయపరమైన చిక్కులను సత్వరమే పరిష్కరించడానికి ఈ పోలీసు స్టేషన్లు ఉపయోగపడాలన్నారు సీఎం జగన్. రైతుల కోసం స్పెషల్ డెస్క్ పెట్టే ఆలోచనలో ఉన్నామన్నారు