Home / BUSINESS / తెలంగాణలో క్వింటాల్ మిర్చి రూ.13,700

తెలంగాణలో క్వింటాల్ మిర్చి రూ.13,700

తెలంగాణ రాష్ట్రంలో  మిర్చి రేటు ఘాటెక్కింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం తేజా రకం, డీలక్స్ రకం మిర్చి గరిష్టంగా క్వింటాల్ రూ.13,700 పలికింది.

నిన్న ఒక్కరోజే రైతులు 50 వేల మిర్చి బస్తాలను మార్కెట్ కు తీసుకొచ్చారు. దీంతో మార్కెట్ మొత్తం ఎర్ర బంగారంతో నిండిపోయింది.

మరోవైపు పత్తిని గరిష్ఠంగా క్వింటాల్ రూ.6 వేలకు వ్యాపారులు కొనుగోలు చేశారు. క్వింటాల్ పత్తికి కేంద్రం మద్దతు ధర రూ. 5,825గా ఉంది