తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. యంగ్ అండ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, టాలీవుడ్ మాటల మాంత్రికుడు,హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రానున్న సరికొత్త సినిమా షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
షూటింగ్ ప్రారంభిస్తే.. తారక్ పుట్టినరోజు అయిన మే 20న టీజర్ ను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కోసం మాటల మాంత్రికుడు ఓ కీలక పాత్రను రాశాడు..
అది పక్కా రాజకీయ నాయకుడి పాత్ర అని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది