తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ తన అభిమానికి ఫోన్ చేసి పరామర్శించారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన పత్తి మనోహార్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
ఆయన బాలయ్యకు వీరాభిమాని. విషయం తెలుసుకున్న బాలకృష్ణ తన అభిమానికి ఫోన్ చేసి బాలకృష్ణ ధైర్యం చెప్పారు. ‘ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని… అతడి కుటుంబానికి తామంతా అండగా ఉంటామని’ భరోసానిచ్చారు. తన అభిమాన హీరో ఫోన్లో మాట్లాడుతుంటే మనోహార్ కంటతడి పెట్టుకున్నాడు.