దంతాలపై గార పోవాలంటే నిమ్మకాయ, పేస్టు, వంటసోడాలను కలిపి వాడాలి. ఇలా నెలకు రెండుసార్లు చేస్తే మంచిది. ఉప్పు, బొగ్గుపొడిని కలిపి ఆ మిశ్రమంతో దంతాలు తోముకుంటే తళతళ మెరుస్తాయి.
ఉప్పులో బోలెడు ఖనిజాలు ఉండడంతో ఇవి దంతాలను శుభ్రంగా ఉంచుతాయి. చిగుళ్లకు సంబంధించిన వ్యాధి ఉంటే మాత్రం ఉప్పు వాడకూడదు. టొమాటో, కమలం, నిమ్మ బత్తాయితో పాటు క్యారెట్ కొరికి తింటే దంతాలకు చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు