Home / SLIDER / క‌పిల్‌ త‌ర్వాత తొలిపేస‌ర్‌గా ఇషాంత్‌

క‌పిల్‌ త‌ర్వాత తొలిపేస‌ర్‌గా ఇషాంత్‌

టీమ్‌ఇండియా తరఫున ఓ పేసర్‌ వంద టెస్టులు ఆడటం అంటే మామూలు విషయం కాదు. అప్పట్లో దిగ్గజ ఆల్‌రౌండర్‌ కపిల్‌దేవ్‌ (131) ఈ ఘనత సాధించగా.. ఆ తర్వాత ఎందరో పేసర్లు జట్టులోకి వచ్చినా.. వారెవరూ ఈ మార్క్‌ చేరుకోలేకపోయారు.

జహీర్‌ ఖాన్‌ (92) ఆశలు రేపినా సెంచరీ మాత్రం కొట్టలేక పోయాడు. ఆ అవకాశం ఇషాంత్‌ శర్మకు దక్కింది. 2007లో అరంగేట్రం చేసిన ఈ ఆరడుగుల బుల్లెట్‌ తన సుదీర్ఘ కెరీర్‌లో వందో టెస్టుకు రెడీ అయ్యాడు.

బుధవారం నుంచి అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగనున్న మూడో టెస్టులో లంబూ ఈ మైలురాయి అందుకోనున్నాడు. వంద అనేది తనకు  అంకె మాత్రమే అంటున్న ఇషాంత్‌.. తనలో సత్తా ఉన్నంత కాలం జట్టు విజయాల కోసం పాటుపడతానన్నాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat