భారత్-ఇంగ్లాండ్ మధ్య ఇవాళ మూడో టెస్టు ప్రారంభం కానుంది. డే/నైట్ రూపంలో జరిగే ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2.30కు స్టార్ట్ అయి రాత్రి 9.30 వరకు కొనసాగుతుంది.
మొతేరాలో తొలి డే అండ్ నైట్ టెస్టు ఇదే కావడం విశేషం. ఈ వేదికపై 2012లో జరిగిన చివరి టెస్టులో.. ఇవే జట్లు తలపడ్డాయి. అప్పుడు పుజార డబుల్ సెంచరీతో మ్యాచ్ గెలిపించాడు. ఇప్పటిదాకా జరిగిన 15 పింక్ బాల్ టెస్టుల్లో పేసర్లు 354, స్పిన్నర్లు 115వికెట్లు తీశారు..