కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 19వ డివిజన్ కార్పొరేటర్ కాసాని సుధాకర్ గారి ఆధ్వర్యంలో పూర్తి చేసిన 175 సభ్యత్వాలు, రుసుమును ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారికి తన నివాసం వద్ద కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు వారిని అభినందించారు. సభ్యత్వ నమోదుకు తక్కువ సమయం ఉన్నందున నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు వాడ వాడలా తిరిగి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి సభ్యత్వాలు పెద్ద ఎత్తున చేయించాలన్నారు. అలాగే పూర్తైన సభ్యత్వాలు ఎప్పటికప్పుడు తన కార్యాలయం వద్ద అందజేయాలని సూచించారు.