Home / MOVIES / భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుములకు రూ.66 వేలు టోకరా

భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుములకు రూ.66 వేలు టోకరా

ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు సెలబ్రిటీలనూ వదలడం లేదు. తాజాగా భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుములకు రూ.66 వేలు టోకరా వేశారు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ అవార్డులకు ‘భీష్మ’ను నామినేట్ చేస్తున్నామని ఓ వ్యక్తి వెంకీకి ఫోన్ చేశాడు.

అది నమ్మిన ఆయన ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.66వేలు పంపించాడు మళ్లీ తర్వాత మరికొంత డబ్బు కావాలని కోరడంతో… అనుమానం వచ్చిన వెంకీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు..