తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంగళవారం రాత్రి 8 గంటల వరకు 29 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 80,878 కరోనా కేసులు నమోదయ్యాయి.
గ్రేటర్ లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు