తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన బండలింగంపల్లి నివాసులైన చింతల విజయ్-సంగీత దంపతులు తమ కొడుకు మౌలిక్(6) మెదడు సంబంధిత వ్యాధితో నాలుగేండ్లుగా బాధపడుతున్నాడు.. ఆస్తులన్నీ అమ్మి చికిత్స చేయించినా కోలుకోలేదని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు.
వెంటనే స్పందించిన మంత్రి.. మౌలిక్ చికిత్సకు తప్పకుండా సహకరిస్తానని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు, టీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి తోట ఆగయ్య తదితరులు పాల్గొన్నారు.